కోళ్లను ఎత్తుకెళ్లేందుకు వచ్చి ఓ యువకుడిపై తీవ్రంగా దాడి చేశారు ముగ్గురు దుండగులు. అనంతరం అక్కడి నుంచి పారిపోయారు. తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ.. బాధిత యువకుడు మృతి చెందాడు. మహరాష్ట్రలోని నవీ ముంబయిలో ఈ ఘటన జరిగింది. మార్చి 29న ఈ ఘటన జరగ్గా.. శనివారం నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మృతుడిని 19 ఏళ్ల వినయ్‌గా పోలీసులు గుర్తించారు. పన్వేల్ పరిధిలోని శివకర్ గ్రామంలో ఘటన జరిగింది. మార్చి 29న రాత్రి 2 గంటల సమయంలో ముగ్గురు దొంగలు ఊర్లోకి చొరబడ్డాడు. అనంతరం ఊరంతా తిరిగారు. కోళ్లను చోరి చేసేందుకు ప్రయత్నించారు. అదే సమయంలో వినయ్ ఇంటి తలుపులు తెరుచి ఉండటాన్ని దొంగలు గమనించారు. అదే అదునుగా ఓ కత్తి తీసుకుని.. వినయ్ ఇంట్లోకి చొరబడ్డారు దొంగలు. వాళ్ల అలికిడితో నిద్రపోతున్న వినయ్ లేచాడు. ఓ గొడ్డలి చేతబట్టి వారిని ఎదిరించాడు. దీంతో ఆ ముగ్గురు దొంగలు అక్కడి నుంచి పారిపోయారు. అయినా వారిని వినయ్ విడిచిపెట్టకుండా.. గొడ్డలి తీసుకుని వారి వెంటే పరిగెత్తాడు.
కొంతదూరం వెళ్లిన తరువాత దొంగలకు, వినయ్‌కు మధ్య తీవ్ర గొడవ జరిగింది. ఆ గొడవలో గొడ్డలితో వినయ్‌పై దాడి చేశారు దొంగలు. అనంతరం అక్కడి నుంచి పారిపోయారు. దొంగలకు కూడా తీవ్ర గాయాలయ్యాయి. కాసేపటి తరువాత వినయ్‌ను వెతుక్కుంటూ కుటుంబ సభ్యులు వచ్చారు. తీవ్రంగా గాయపడ్డ వినయ్ గుర్తించి వెంటనే ఆసుపత్రికి తీసుకెళ్లారు. చికిత్స పొందుతూ అతడు ఆసుపత్రిలోనే మృతి చెందాడు. వినయ్ కుటుంబ సభ్యుల ఫిర్యాదు ఆధారంగా.. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. అనంతరం నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. శనివారం రాత్రి వారిని అదుపులోకి తీసుకున్నారు. నిందితులు ముగ్గులు ఒక బేకరి షాపులో పనిచేసేవారని పోలీసులు వెల్లడించారు.
తాళాలు పగలగొట్టి మాంసం దుకాణంలో చోరీ.. 55 కోళ్లు మాయం..
బిహార్‌లోని మోతిహరి జిల్లాలోని ఓ చికెన్ షాపులో ఇటీవల దొంగలు బీభత్సం సృష్టించారు. దుకాణం తాళాలు పగలగొట్టి 55 కోళ్లను ఎత్తుకెళ్లారు. జనవరి 2న రాత్రి ఈ ఘటన జరిగింది. పటాహి పోలీస్ స్టేషన్ పరిధిలోని బక్రీ బజార్లో దొంగలు ఈ చోరీకి పాల్పడ్డారు. మొహమ్మద్ ఇజ్రాయెల్‌కు చెందిన చికెన్ షాపులో గుర్తుతెలియని వ్యక్తులు 55 కోళ్లను చోరీ చేశారు. దొంగలు టెంపోలో వచ్చి చోరీకి పాల్పడ్డారు. పూర్తి వార్తా కథనం కోసం ఇక్కడ క్లిక్ చేయండి.