ఛత్తీస్‌గఢ్ కోండాగావ్ జిల్లాలో(Chhattisgarh raipur news) ఆదివారం ఘోర రోడ్డు ప్రమాదం(Road Accident) జరిగింది. ఆటో రిక్షా, ఎస్యూవీ ఢీకొన్న ఘటనలో(Road Accident) ఏడాది పాప సహా, ఒకే కుటుంబానికి చెందిన 9 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో ఏడుగురు గాయపడ్డారు.
ఎలా జరిగిందంటే..
పందీత్ గ్రామానికి చెందిన ఓ కుటుంబం.. గోద్మా గ్రామంలో తమ బంధువు అంత్యక్రియలకు హాజరైన తిరిగి వస్తున్న క్రమంలో ఈ ప్రమాదం జరిగింది. వారు ప్రయాణిస్తున్న ఆటోను.. బోర్గావ్ వద్ద ఓ ఎస్యూవీ ఢీకొంది. దీంతో ఆటో డ్రైవర్‌తో పాటు అందులోని ఏడుగురు వ్యక్తులు అక్కడికక్కడే మరణించారని ఓ అధికారి తెలిపారు. మరొకరు ఆస్పత్రికి తరలించాక ప్రాణాలు కోల్పాయారని చెప్పారు.
జగ్దల్పుర్ నుంచి ఎస్యూవీ వస్తుండగా ఈ ప్రమాదం జరిగిందని సదరు అధికారి తెలిపారు. మృతులంతా ఒకే కుటుంబానికి చెందినవారు కాగా.. వారిలో ఏడాది చిన్నారి సహా నలుగురు మహిళలు ఉన్నట్లు చెప్పారు. ప్రమాదం జరిగిన వెంటనే ఎస్యూవీ.. ఘటనాస్థలి నుంచి పరారైనట్లు పేర్కొన్నారు. గాయపడ్డవారిని స్థానిక ఆస్పత్రిలో చేర్పించామని వెల్లడించారు.
మృతదేహాలను పోస్టుమార్టం కోసం అధికారులు తరలించారు. పరారైన ఎస్యూవీ కోసం గాలిస్తున్నట్లు చెప్పారు.
నలుగురు మృతి..
మరోవైపు.. రాజస్థాన్ హనుమాన్‌గఢ్ జిల్లాలో(Rajasthan Hanumangarh News) ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో(Rajasthan Accident News Today) నలుగురు వ్యక్తులు ప్రాణాలు కోల్పోయారు. కారు, ట్రక్కు ఢీకొనగా ఈ ఘటన జరిగింది.
రావత్సర్- హనుమాన్ గఢ్ రహదారిపై ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు తెలిపారు. మృతులంతా 17 నుంచి 20 ఏళ్ల మధ్య వయసు వారేనని చెప్పారు. పోస్టుమార్టం అనంతరం మృతదేహాలను వారి కుటుంబాలకు అప్పగించినట్లు పేర్కొన్నారు.
ఇదీ చూడండి: నడిరోడ్డుపై దారుణ హత్య.. బావను కత్తితో పొడిచి..