ఛత్తీస్గఢ్ శాసనసభలో అసాధారణ సంఘటన జరిగింది. అసెంబ్లీ నుంచి మంగళవారం వాకౌట్ చేశారు రాష్ట్ర ఆరోగ్య మంత్రి టీఎస్ సింగ్ దేవ్. తనపై ఎమ్మెల్యే బృహస్పతి సింగ్ చేసిన ఆరోపణలపై దర్యాప్తునకు ఆదేశిస్తేనే శాసనసభకు హాజరవుతానని చెప్పారు.
"ఎమ్మెల్యే బృహస్పతి సింగ్ ఆరోపణలపై ప్రభుత్వం దర్యాప్తునకు ఆదేశించే వరకు లేదా ప్రకటన విడుదల చేసే వరకు అసెంబ్లీలో ఉండే అర్హత నాకు లేదని భావిస్తున్నా."
- టీఎస్ సింగ్ దేవ్, రాష్ట్ర ఆరోగ్య మంత్రి
ఎందుకీ వివాదం?
టీఎస్ సింగ్ దేవ్ తననకు చంపడానికి యత్నించారని ఇటీవలే ఆరోపించారు ఎమ్మెల్యే బృహస్పతి సింగ్. దేవ్ అనుచరుల కారు జులై 24న తనను అనుసరిస్తున్న కారును కావాలనే ఢీకొట్టిందని ఆయన పోలీసులకు ఫిర్యాదు చేశారు.
ఈ ఆరోపణలను తప్పుబడుతూ మంగళవారం సభ నుంచి వాకౌట్ చేశారు మంత్రి. అయితే మరో ఇద్దరు కేబినెట్ మంత్రుల సూచన మేరకు సింగ్ కాసేపటికి దేవ్ తిరిగి అసెంబ్లీ చేరుకున్నారు.
సింగ్ దేవ్ తనను చంపాలనుకుంటున్నట్లు ఐజీ, హోంమంత్రి, సీఎం ఎదుట బృహస్పతి చెప్పలేదని, అది భావోద్వేగంలో చేసిన వ్యాఖ్య అని రాష్ట్ర కాంగ్రెస్ ఇన్ఛార్జ్ పీఎల్ పునియా వివరణ ఇచ్చారు.
ఇదీ చూడండి: కలహాల బాటలో నేతలు- నివారించలేకపోతున్న అధిష్ఠానం