తప్పతాగితే కామాంధులు ఒళ్లు తెలియకుండా ప్రవర్తిస్తున్నారు. బాలికలనే కనీస కనికరం లేకుండా అఘాయిత్యాలకు (Rape Victim news) పాల్పడుతున్నారు. అపహరించి అత్యాచారానికి పాల్పడే ఘటనలు కలచివేస్తున్న తరుణంలో సంరక్షణ గృహంలోనే ఆకృత్యాలకు పాల్పడుతున్న ఘటన వెలుగులోకి వచ్చింది.
సంరక్షణ కేంద్రంలోనే..
దివ్యాంగులను అన్నలా చూసుకోవాల్సిన కేర్‌టేకరే.. 15 ఏళ్ల బాలికపై అత్యాచారానికి ఒడిగట్టాడు. ఈ దారుణ ఘటన ఛత్తీస్‌గఢ్ (Chhattisgarh News) జశ్పుర్లోని సమర్థ్ దివ్యాంగ సెంటర్లో జరిగింది.
కేంద్రంలో 22 మంది దివ్యాంగ చిన్నారులు, మరో 12 మంది బాలికలున్నారు. ఎవరూ వినలేరు. మాట్లాడలేరు. ఘటన జరిగిన సెప్టెంబర్ 22న హాస్టల్ సూపరింటెండెంట్ లేరు. సంరక్షకుడు రాజేశ్ రామ్, వాచ్మెన్ నరేంద్ర భగత్‌కు వారి బాధ్యతను అప్పజెప్పారు. రాత్రి 11 గంటల సమయంలో వాళ్లిద్దరూ తాగి హాస్టల్‌కు వచ్చారు. చిన్నారులపై వారి కన్ను పడింది. బాలికలను ఇష్టమొచ్చినట్లు కొట్టారు. కొందరి దుస్తులు చిరిగిపోయాయి.
ఈ సమయంలో బాలికల కేకలు విని అక్కడికి వచ్చారు స్వీపర్ కుమారీ బాయి. వారి నుంచి చిన్నారులను విడిపించేందుకు ప్రయత్నించారు. కానీ, ఆమెను బాత్రూమ్లో బంధించారు నిందితులు.
ఆ తర్వాత.. హాస్టల్ సూపరింటెండెంట్‌కు ఫోన్ చేసి విషయం చెప్పారు కుమారి. ఈ క్రమంలోనే ఓ బాలికపై భగత్ అత్యాచారం చేయగా, మరో ఐదుగురు చిన్నారులను లైంగికంగా వేధించాడు రాజేశ్.
అనంతరం ఆ మధ్య రాత్రి అక్కడికి చేరుకున్నారు సూపరింటెండెంట్. నిందితులను విధుల నుంచి తొలగించి పంపించేశారు. వారిపై కేసు నమోదు చేశారు పోలీసులు.
నాలుగు రోజులు బంధించి..
టీనేజర్‌ను అపహరించి నాలుగు రోజుల పాటు అత్యాచారానికి పాల్పడిన దారుణ ఘటన రాజస్థాన్‌లో (Rajasthan Rape Victim) జరిగింది. బూందీ జిల్లాలో వ్యవసాయ కూలీ పనిచేస్తున్న 23 ఏళ్ల వ్యక్తి ఈ అమానుషానికి పాల్పడ్డాడు.
గత శనివారం బాలిక కనిపించకుండా పోయిందని ఆమె మామయ్య పోలీసులకు ఫిర్యాదు చేశారు. బుధవారం రోజున బాలిక ఆచూకీ లభించింది. ఈ వ్యవహారంపై దర్యాప్తులో.. సుర్లీ గ్రామానికి చెందిన బబ్లూ మీనా అనే వ్యక్తి బాలికను అపహరించినట్లు తెలిసిందని పోలీసులు తెలిపారు. ఆమెను తను పనిచేసే పొలం వద్ద ఓ గృహంలో నిర్బంధించినట్లు వెల్లడించారు. తన సహాయకుడిని బయట కాపలా పెట్టి నాలుగు రోజుల పాటు బాలికపై అఘాయిత్యానికి పాల్పడినట్లు వివరించారు. నిందితులపై పోక్సో చట్టం కింద కేసు నమోదైంది.
అపహరించి అమానుషం..
యూపీలో (UP Rape Victim Latest News) మరో దారుణం వెలుగులోకి వచ్చింది. జహానాబాద్‌లో 16 ఏళ్ల బాలికను అపహరించి అత్యాచారానికి ఒడిగట్టాడు 22 ఏళ్ల యువకుడు.
తన ఇంటి బయట షెడ్లో నిద్రిస్తున్న బాలికను అపహరించి తన ఇంటికి తీసుకెళ్లాడు నిందితుడు. అనంతరం ఆమెపై అతాచారానికి పాల్పడ్డాడు. బాలిక లేదని గుర్తించిన తండ్రి, మరి కొందరు గ్రామస్థులతో కలిసి అతడి నుంచి అమ్మాయిని రక్షించారు. యువకుడిపై పోలీసులు పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు.
ఇదీ చూడండి: కుమార్తెనే గర్భవతిని చేసిన తండ్రి.. అబార్షన్‌కు ఒప్పుకోలేదని...