Family suicide: ఛత్తీస్‌గఢ్ కాంకేర్ జిల్లాలో విషాధ ఘటన జరిగింది. భార్యాభర్తలు తమ ఇద్దరు పిల్లలకు విషమిచ్చి అనంతరం తాము కూడా ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. బస్తర్ లాడ్జికి వెళ్లి బలవన్మరణానికి పాల్పడ్డారు. ఒకే కుటుంబానికి చెందిన నలుగురి మృతదేహాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. భార్యాభర్తల ఉరి కొయ్యకు విగతజీవులుగా వేలాడగా.. పిల్లల మృతదేహాలు బెడ్‌పై ఉన్నట్లు తెలిపారు. మొదట పిల్లలకు విషమిచ్చి, వారు చనిపోయిన తర్వాతే తల్లిదండ్రులు ఉరివేసుకున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. పిల్లల చేతులు కట్టేసి ఉన్నాయని, వారి నోట్లో నుంచి నురగ వచ్చినట్లు పేర్కొన్నారు. ప్రస్తుతానికి ఆత్మహత్యలుగానే భావిస్తున్నామని చెప్పారు. బుధవారం రాత్రి 8:30 గంటలకు ఈ కుటుంబం లాడ్జికి వెళ్లిందని, గురువారం రాత్రి 10 గంటల వరకు తలుపులు తీయకపోవడం వల్ల పోలీసులకు సమాచారం అందిందని వివరించారు. వీరు రాయ్‌పుర్‌కు చెందిన వారని గుర్తింనట్లు వెల్లడించారు.
Loud speaker death: గుజరాత్ మెహ్సానాలో 40 ఏళ్ల వ్యక్తిని కొందరు కొట్టి చంపారు. అతను ఆలయంలో లౌడ్ స్పీకర్లు మోగించాడని ఈ క్రూర చర్యకు పాల్పడ్డారు. ఈ ఘటనకు సంబంధించి ఆరుగురిని అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు.
ఝార్ఖండ్ గుమ్లాలో 45 ఏళ్ల షమీమ్ అన్సారీని ఓ సమూహం కర్రలతో దారుణంగా కొట్టి చంపింది. రాయ్కేరా ఫారెస్ట్ కమిటీ అధ్యక్షునిగా ఉన్న అతను.. శుక్రవారం ఉదయం 10:30గం.లకు కొందరు అడవిలో అక్రమంగా చెట్లు నరుకుతుండటాన్ని చూసి పోలీసులకు సమాచారం అందించాడు. ఆ తర్వాత కాసేపటికే అతన్ని గ్రామస్తులు కొట్టి చంపినట్లు అటవీ అధికారులు వెల్లడించారు.
British woman molested: మహారాష్ట్ర బాంద్రాలోని ఓ క్లబ్లో 44 ఏళ్ల బ్రిటిష్ మహిళను ఓ వ్యక్తి లైంగికంగా వేధించాడు. ఆమె భర్త ఉండగానే అసభ్యంగా ప్రవర్తించాడు. నిందితుడిని అరెస్టు చేసినట్లు ముంబయి పోలీసులు శుక్రవారం తెలిపారు. బాధిత మహిళ, ఆమె భర్త బ్రిటిష్ డిప్యూటీ హై కమిషన్‌లోనే పనిచేస్తున్నట్లు వెల్లడించారు. మంగళవారం రాత్రి భార్యాభర్తలు క్లబ్‌కు వెళ్లినప్పుడు ఈ ఘటన జరిగినట్లు వివరించారు.
ఇదీ చదవండి: పెళ్లికి వెళ్తుండగా ప్రమాదం.. ఆరుగురు దుర్మరణం