ETV Bharat / bharat

బిర్యానీ ATM.. నిమిషాల్లో ఫుడ్ మీ చేతుల్లో.. అంతా డిజిటల్​గానే - బీవీకే బిర్యానీ ఏటీఎం

క్యాష్ ఏటీఎంల గురించి మనందరికీ తెలుసు. ఈ మధ్య గోల్డ్ ఏటీఎంలు కూడా వచ్చేశాయ్. కానీ, బిర్యానీ ఏటీఎంల గురించి ఎప్పుడైనా విన్నారా? అదేంటి? అదెలా పనిచేస్తుందని మీ డౌటా? అచ్చం సాధారణ ఏటీఎంల లాగే ఇదీ పనిచేస్తుంది. బిర్యానీ ఎంపిక చేసుకొని పేమెంట్ చేసేస్తే.. నిమిషాల్లోనే ఫుడ్ బాక్స్ మీ చేతిలో ఉంటుంది. మరి ఇది ఎక్కడ ఉందో తెలుసా?

chennai-biryani-atm
chennai-biryani-atm
author img

By

Published : Mar 19, 2023, 5:45 PM IST

చెన్నైలో బిర్యానీ ఏటీఎం వెలిసింది. ఆహార ప్రియులకు వేడివేడి బిర్యానీని అందిస్తోంది. చెన్నైకి చెందిన 'బీవీకే (బాయ్ వీటు కల్యాణం) బిర్యానీ' అనే స్టార్టప్ ఈ ఆటోమేటెడ్ బిర్యానీ మెషీన్​ను నెలకొల్పింది. కొలత్తూర్ ప్రాంతంలో ఈ బిర్యానీ ఏటీఎంను ఏర్పాటు చేసింది. వివాహాల్లో అందించే రుచికరమైన ప్రీమియం బిర్యానీని ఈ ఏటీఎం ద్వారా సప్లై చేస్తున్నట్లు బీవీకే స్టార్టప్ చెబుతోంది. ఫామ్ నుంచి నేరుగా తీసుకొచ్చిన మాంసంతో ఈ బిర్యానీలను సిద్ధం చేసి సరఫరా చేస్తున్నట్లు తెలిపింది. చికెన్, మటన్, బీఫ్ వంటి వెరైటీ బిర్యానీలను ఈ ఏటీఎం ద్వారా అందిస్తున్నారు.

సాధారణంగా బిర్యానీ అంటేనే లొట్టలు వేసుకునే ఆహార ప్రియులు.. కొత్తగా ఏటీఎం పెట్టారని తెలుసుకొని కోలత్తూర్​కు పోటెత్తారు. స్థానికులంతా.. ఆ బిర్యానీ ఏటీఎంను ట్రై చేసేందుకు ఎగబడుతున్నారు. ఇందుకు సంబంధించి పలు వీడియోలు సైతం సోషల్ మీడియాలో ట్రెండింగ్​లోకి వచ్చాయి. వైరల్ అవుతున్న ఓ వీడియోలో.. ఓ వ్యక్తి బిర్యానీ ఏటీఎం దగ్గరికి వెళ్తాడు. ఏటీఎం స్క్రీన్​పై.. ఏఏ బిర్యానీ అందుబాటులో ఉందనే వివరాలు ఉంటాయి. మెనూలో నుంచి నచ్చిన బిర్యానీని ఆ వ్యక్తి ఎంపిక చేసుకుంటాడు. డబ్బులు చెల్లించగానే కాసేపు వేచి ఉండాలని ఏటీఎంపై డిస్​ప్లే అవుతుంది. నిమిషాల వ్యవధిలోనే ఏటీఎం యంత్రంలో నుంచి బిర్యానీ బాక్స్ బయటకు వస్తుంది.

మనుషుల ప్రమేయం లేకుండా కస్టమర్లకు బిర్యానీ అందిస్తున్న తొలి సంస్థ దేశంలో తామేనని బీవీకే బిర్యానీ చెబుతోంది. ఆకలితో ఉన్న బిర్యానీ ప్రేమికులకు నిమిషాల వ్యవధిలోనే.. ఫుడ్ సప్లై చేస్తామని అంటోంది. బిర్యానీ ఏటీఎం ద్వారా కొత్త అనుభూతిని సైతం పొందవచ్చని చెబుతోంది. బీవీకే బిర్యానీ ఏటీఎంలో అధునాతన ఫీచర్లు ఉన్నాయి. ఈ ఏటీఎంకు 32 అంగుళాల స్క్రీన్​ను అమర్చారు. క్యూఆర్ కోడ్ ద్వారా పేమెంట్ చేసే అవకాశం కల్పిస్తున్నారు. డెబిట్, క్రెడిట్ కార్డులతోనూ పేమెంట్ చేసే వీలు ఉంది. ఫుడ్ తీసుకోవడం మినహా.. బిర్యానీ ఆర్డర్ ప్రక్రియ మొత్తం డిజిటల్​గానే పూర్తవుతుంది.

ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోను వేలాది మంది వీక్షించారు. దీనిపై నెటిజన్లు భిన్నంగా స్పందిస్తున్నారు. బిర్యానీని టేస్ట్ చేసేందుకు తాము ఎదురుచూస్తున్నామని కొందరు పోస్టులు చేస్తున్నారు. ఇంకొందరు మాత్రం కొన్ని అనుమానాలు లేవనెత్తుతున్నారు. బిర్యానీ నాణ్యతపై ప్రశ్నలు అడుగుతున్నారు. బిర్యానీ నిజంగానే ఫ్రెష్​గా ఉంటుందో లేదోనని అనుమానిస్తున్నారు. ఇక మరికొందరైతే.. ధరను చూసి అవాక్కవుతున్నారు. సాధారణ బిర్యానీతో పోలిస్తే చాలా అధికంగా వసూలు చేస్తున్నారని అంటున్నారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.