Chengalpattu Road Accident Today : అదుపుతప్పి ఓ లారీ.. రోడ్డు దాటుతున్న మూడు బైక్‌లపైకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో బైక్‌లపై ఉన్న ఆరుగురు అక్కడికక్కడే మృతి చెందారు. తమిళనాడు.. చెంగల్పట్టు జిల్లాలోని పొతేరి సమీపంలో శుక్రవారం ఉదయం 9 గంటలకు జరిగిందీ దుర్ఘటన. సమాచారం అందుకున్న గుడవంచెరి పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. పోస్ట్‌మార్టం పరీక్షల కోసం చెంగల్పట్టు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.
నుజ్జునుజ్జైన మృతదేహాలు..
Lorry Rammed Into Bikes : ప్రమాదంలో మృతదేహాలు గుర్తుపట్టలేనంతగా నుజ్జునుజ్జయ్యాయి. ఘటనాస్థలికి స్థానికులు భారీగా చేరుకున్నారు. ఈ క్రమంలో కాసేపు ట్రాఫిక్ జామ్ అయ్యింది. వారందరినీ పోలీసులు చెదరగొట్టారు. అలాగే ప్రమాదానికి గల కారణాలపై ఆరా తీస్తున్నారు. బైక్‌లను ఢీకొట్టిన అనంతరం లారీ.. బారికేడ్‌ను ఢీకొట్టిందని పోలీసులు తెలిపారు. మృతులు వివరాలు ఇంకా తెలియరాలేదని చెప్పారు. గుర్తుపట్టలేనంత మృతదేహాలు నుజ్జునుజ్జయాయని పోలీసులు అన్నారు.
లోయలో పడిన బొలేరో.. ఏడుగురు మృతి
Himachal Pradesh Accident Today : ఓ బొలెరో వాహనం అదుపుతప్పి లోయలో పడిన ఘటనలో ఏడుగురు దుర్మరణం పాలయ్యారు. మరో నలుగురు గాయపడ్డారు. మృతుల్లో ఆరుగురు పోలీసులు, ఓ డ్రైవర్ ఉన్నారు. హిమాచల్‌ప్రదేశ్ చంబా జిల్లాలో శుక్రవారం జరిగిందీ దుర్ఘటన.
అసలేం జరిగిందంటే..
Bolero Falls into Gorge in Himachal Pradesh : చంబా జిల్లాలోని తీసా నుంచి బైరాగఢ్‌కు రోడ్డు మార్గంలో వెళ్తున్న ఓ బొలెరో 100 మీటర్ల లోతైన లోయలో పడింది. ఈ ప్రమాదంలో ఏడుగురు మరణించగా.. మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను చంబా జిల్లా ఆస్పత్రికి తరలించారు. ప్రమాద సమయంలో బొలెరోలో 11 మంది ఉన్నట్లు తెలుస్తోంది. అందులో 9 మంది పోలీసులు, డ్రైవర్, స్థానికుడు ఉన్నట్లు సమాచారం. లోయలో పడ్డ వాహనాన్ని తీసేందుకు పోలీసులు సహాయక చర్యలను చేపట్టారు. ప్రమాదానికి గల కారణాలపై ఆరా తీస్తున్నారు. ప్రమాద సమాచారం అందిన వెంటనే చురహ్ ఎమ్మెల్యే హంసరాజ్ పరిశీలించారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు.
మథుర వెళ్తుండగా విషాదం.. ట్రాక్టర్- ట్రక్కు ఢీ.. ఆరుగురు భక్తులు మృతి
లగేజ్ వ్యాన్‌పై ట్యాంకర్ బోల్తా.. 8 మంది మృతి.. మరో ఏడుగురి పరిస్థితి విషమం