ETV Bharat / bharat

Chenchus life style in Nallamala : నల్లమలలో ఒకరోజు.. గిరిపుత్రులతో గడిపేద్దాం రండి - నల్లమల అడవులు

Chenchus life style in Nallamala : నాగరిక సమాజానికి దూరంగా అమ్రాబాద్ పులుల అభయారణ్యంలోని మారుమూల ప్రాంతాల్లో చెంచులు నివసించే ఆవాసాలు చెంచుపెంటలు. అక్కడి వారికి కనీస వసతులు దొరకడం చాలా ఖర్చుతో కూడుకున్నపని. చెంచులకు నిత్యావసరాలు కావాలన్నా, ఇతర సామాగ్రి కొనాలన్నా పదుల కిలోమీటర్ల అడవిదాటి మైదాన ప్రాంతానికి రావాల్సిందే. ఈ వ్యయప్రయాసలు భరించలేని చెంచులు.. అవసరాలు తీర్చుకోకుండానే అడవుల్లో కాలం గడుపుతున్నారు. అలాంటివారికి తమ వంతు సాయం అందిస్తున్నారు దాతలు. కళ్లెం శ్రీనివాస్ రెడ్డి నేతృత్వంలో 'నల్లమల అడవిలో ఒకరోజు' పేరిట కార్యక్రమం నిర్వహిస్తున్నారు.

chenchulu
chenchulu
author img

By

Published : May 16, 2023, 1:37 PM IST

చెంచుపెంటలకు చేయుతనిస్తున్న స్వచ్ఛంద సంస్థలు

Chenchus life style in Nallamala : సమాజానికి దూరంగా అమ్రాబాద్ అటవీ ప్రాంతం లోతట్టున ఉన్న చెంచులను ఆదుకుంటూ, వారి కనీస అవసరాలు తీర్చేందుకు స్వచ్ఛంద సంస్థలు ముందుకొస్తున్నాయి. ఆర్​డీటీ, లయన్స్‌ క్లబ్‌, కోనేరు లాంటి సంస్థలు వివిధ రకాలుగా సేవలందిస్తున్నాయి. మానవతా దృక్పథం గల కొందరు వ్యక్తులు సమూహంగా, వ్యక్తిగతంగా చెంచులకు దుస్తులు, దుప్పట్లు, నిత్యావసర సరకులు, గృహోపకరణాలు సమకూర్చి ఆదుకుంటున్నారు.

Nallamala Chenchus life style : ఇదే కోవలో 'లయన్స్‌ క్లబ్‌ ఆఫ్‌ హైదరాబాద్‌'.. సనత్‌నగర్‌ సమన్వయకర్త కళ్లెం శ్రీనివాస్‌ రెడ్డి నల్లమలలోని చెంచులకు వంటసామగ్రి, దుప్పట్లు, పిల్లలకు ఆటవస్తువులు అందించేందుకు ముందుకొచ్చారు. 'నల్లమల అడవిలో ఒకరోజు' పేరిట జనవరి నుంచి 2 నెలలకో చెంచుపెంటకు వెళ్తున్నారు. ఒక్కో కుటుంబానికి 4 వేల విలువైన వంట సామగ్రి అందిస్తున్నారు. ఇప్పటివరకు మల్లాపూర్‌, పుల్లాయిపల్లి చెంచుపెంటలో నిర్వహించిన శిబిరాల్లో 40కుటుంబాలకు విద్యుత్తు ఉద్యోగులు, టైపిస్ట్‌ ఉద్యోగులు సాయం అందించారు.

"మేము చేసే కార్యక్రమాలన్నీ ముందుగా నిర్ణయించుకుంటాం. వాట్స్​ప్​లో ఒక గ్రూప్​ క్రియేట్​ చేసుకొని కార్యక్రమానికి సంబందించి ఖర్చులు, సామన్లు కొనుగోలు ఇలా ప్రతి ఒక్కటి అందులోనే చర్చించుకుంటాం. ఈ కార్యక్రమానికి ఉద్యోగులు స్వచ్ఛందంగా డబ్బులు ఇస్తుంటారు. ఆ డబ్బులతో అడవి బిడ్డల కనీస అవసరాలు తీర్చుతాం".- కళ్లెం శ్రీనివాస్ రెడ్డి, సహాయ గణాంకాధికారి విద్యుత్తు శాఖ

Nallamala Chenchus life style in Telangana : 'లయన్స్‌ క్లబ్‌ సనత్‌నగర్‌' సహకారంతో లింగాల మండలం రాంపూర్‌ పెంటలో 25 చెంచు కుటుంబాలకు వంట సామగ్రి, దుస్తుల పంపిణీ చేశారు. అమ్రాబాద్‌ ఎస్​ఐ వీరబాబు గతంలో విద్యుత్తు విజిలెన్స్‌ విభాగంలో పనిచేయడం వల్ల.. కళ్లెం శ్రీనివాస్ రెడ్డితో పరిచయం ఉంది. విద్యుత్తు శాఖలో పనిచేసే శ్రీనివాస రెడ్డి.. వేతనం నుంచి 20శాతం సమాజ సేవా కార్యక్రమాలకు వెచ్చిస్తున్నారు.

way of life style in Chenchus : సేవాభావం గల వారి తోడ్పాటుతో సేవలు విస్తృతం చేస్తున్నారు. ఇది తెలుసుకున్న వీరబాబు.. నల్లమలలోని చెంచులకు సేవలందించాలని కోరారు. అడవుల్లో కనీస మౌలికవసతులు కూడా కరవై జీవిస్తున్న చెంచులకు తమవంతు సాయం అందించడంపై దాతలు సంతోషం వ్యక్తంచేశారు. ఇకపై ఎక్కడ ఏ అవసరముందో తెలుసుకుని అన్ని చెంచుపెంటలకు సాయం అందించేందుకు యత్నిస్తామని వెల్లడించారు.

"స్వచ్ఛంద సంస్థలు మా ప్రాంతాలోకి వచ్చి సహాయం చేయడం చాలా సంతోషంగా ఉంది. కానీ ప్రభుత్వం, స్వచ్ఛంద సంస్థలు ముందుకు వచ్చి ఈ ఖర్చులు మా పిల్లల చదువులు, వైద్యం, మంచి నీటి సదుపాయం గురించి కేటాయిస్తే మరింత బాగుంటుందని నా అభిప్రాయం".-బాల గురువయ్య, అప్పాపూర్ సర్పంచ్

స్వచ్ఛంద సంస్థల సేవలపై అప్పాపూర్ పెంట సర్పంచ్ బాలగురువయ్య హర్షం వ్యక్తంచేశారు. కాకపోతే ఈ సేవల్ని విద్య, వైద్యం, మంచినీటి విభాగాల్లో అందిస్తే చెంచులకు మేలు చేసినట్లువుతుందని అభిప్రాయపడ్డారు. ఉమ్మడి రాష్ట్రంలో ఐటీడీఏ చెంచుల బాగోగులు చూసేదని.. ప్రస్తుతం దానికి ఉద్యోగ సిబ్బంది, బడ్జెట్‌ కేటాయించకపోవడం వల్ల ఈ పరిస్థితి దాపురించిందని స్థానిక సర్పంచ్‌ చెబుతున్నారు. ఐటీడీఏ మెరుగైతే చెంచుల పరిస్థితి బాగుపడుతుందని అభిప్రాయపడ్డారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.