రాజ్యసభ, లోకసభ కార్యకలాపాల నిర్వహణ సమయాల్లో స్వల్ప మార్పులు జరిగాయి. మంగళవారం నుంచి ఇవి అమల్లోకి వస్తాయని అధికారులు తెలిపారు. రాజ్యసభ కార్యకలాపాలు ఉదయం 9గంటల నుంచి మధ్యాహ్నం 2గంటల వరకు జరగుతాయి. లోకసభ కార్యకలాపాలు సాయంత్రం 4గంటల నుంచి రాత్రి 9గంటల వరకు కొనసాగుతాయని అధికారులు వెల్లడించారు. కరోనా నేపథ్యంలో రెండు సభలు ఒకేసారి జరగకుండా వేర్వురు సమయాలు కేటాయించినట్లు పేర్కొన్నారు.
రెండు సభలు ఒక్కొక్కటి రోజుకు 5గంటల చొప్పున కార్యకలాపాలు జరిగేలా చర్యలు తీసుకున్నారు. ఉభయ సభల్లోనూ ప్రశ్నోత్తరాల సమయం, శూన్య కాల సమయం ఉంటుందని ప్రభుత్వం ప్రకటించింది. సెప్టెంబర్లో జరిగిన సమావేశాల్లో ఈ రెండూ నిర్వహించలేదు.
ఇదీ చూడండి: రైతులను ఆపేందుకు దిల్లీ సరిహద్దులో మేకులు