Chandrayaan 3 Rover Update : చంద్రయాన్-3 మిషన్ సాఫ్ట్ ల్యాండింగ్ ద్వారా మూడు లక్ష్యాల్లో రెండు సాధించినట్లు ఇస్రో తెలిపింది. మూడోదైన మట్టి, రాళ్లలోని రసాయనాల కూర్పు, ఖనిజాలపై అన్వేషణ కొనసాగుతోందని పేర్కొంది. ఈ మేరకు ఎక్స్‌లో ట్వీట్ చేసింది. జాబిల్లి దక్షిణ ధ్రువంపై ల్యాండర్‌ను సురక్షితంగా దించడం, ఉపరితలంపైకి ప్రగ్యాన్ రోవర్ చేరుకోవడం, రోవర్ ద్వారా పరిశోధన చేయడం వంటి మూడు లక్ష్యాలను ఇస్రో పెట్టుకుంది. ఇందులో రెండు లక్ష్యాలు ఇప్పటికే సాధించగా ఇప్పుడు మూడో లక్ష్యసాధన దిశగా రోవర్ ప్రగ్యాన్ పనిచేస్తున్నట్లు ఇస్రో తెలిపింది. రోవర్ తాను కనుగొన్న విషయాలను ల్యాండర్‌కు చేరవేస్తుంది. రోవర్ ప్రగ్యాన్ చేరవేసిన విషయాలను ల్యాండర్ తిరిగి భూమికి పంపిస్తుంది.
రోవర్ మరో వీడియో విడుదల చేసిన ఇస్రో..
Isro Video of Pragyan Rover : చంద్రుని ఉపరితలంపై చంద్రయాన్ 3లోని ప్రగ్యాన్ రోవర్.. ప్రయాణిస్తున్న వీడియోను ఇస్రో విడుదల చేసింది. విక్రమ్ ల్యాండర్ నుంచి ప్రగ్యాన్ దిగుతున్న వీడియోను ఇప్పటికే విడుదల చేసిన ఇస్రో.. తాజాగా ఈ కొత్త వీడియోను పోస్టు చేసింది. ఇందులో బంగారు రంగులో ప్రగ్యాన్ చంద్రుని మట్టిపై నెమ్మదిగా కదిలింది. ఆ తర్వాత ఉన్నచోటే ఒంపు తిరగడం స్పష్టంగా కనిపిస్తోంది. రోవర్ వెళ్లినంత దూరం దాని చక్రాల అచ్చు.. జాబిల్లి ఉపరితలంపై పడటం వీడియోలో గమనించవచ్చు. రోవర్‌కు సౌరశక్తిని ఇచ్చేందుకు అమర్చిన సోలార్ ప్లేట్లు కూడా కనిపిస్తున్నాయి. ల్యాండర్ ఇమేజర్ కెమెరా నుంచి ఈ వీడియోను విక్రమ్ తీసింది.
-
Chandrayaan-3 Mission:
— ISRO (@isro) August 26, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
🔍What's new here?
Pragyan rover roams around Shiv Shakti Point in pursuit of lunar secrets at the South Pole 🌗! pic.twitter.com/1g5gQsgrjM
">Chandrayaan-3 Mission:
— ISRO (@isro) August 26, 2023
🔍What's new here?
Pragyan rover roams around Shiv Shakti Point in pursuit of lunar secrets at the South Pole 🌗! pic.twitter.com/1g5gQsgrjMChandrayaan-3 Mission:
— ISRO (@isro) August 26, 2023
🔍What's new here?
Pragyan rover roams around Shiv Shakti Point in pursuit of lunar secrets at the South Pole 🌗! pic.twitter.com/1g5gQsgrjM
శివశక్తి పాయింట్‌పై అధికార విపక్షాల మధ్య మాటల యుద్ధం..
చంద్రుని దక్షిణ ధ్రువం ఉపరితలంపై విక్రం ల్యాండర్ దిగిన ప్రాంతానికి ప్రధానమంత్రి నరేంద్రమోదీ.. శివశక్తి పాయింట్ అని నామకరణం చేయడంపై అధికార, ప్రతిపక్షాల మధ్య మాటలయుద్ధానికి దారితీసింది. చంద్రుని ఉపరితలంపై ఉన్న ప్రాంతానికి.. మోదీ పేరు పెట్టడం హాస్యాస్పదమని కాంగ్రెస్ సీనియర్ నేత రషీద్ అల్వీ అన్నారు. జాబిల్లిపై మనుషులకు ఏం హక్కుందని.. పేరు పెట్టారని ప్రశ్నించారు. చంద్రునిపై దిగడం సంతోషకరమనీ.. అందుకు మనందరం గర్వపడాలన్నారు. అయితే చంద్రునిపై మనకు ఎలాంటి హక్కులు లేవని అల్వీ వ్యాఖ్యానించారు. అల్వీ వ్యాఖ్యలను భారతీయ జనతా పార్టీ గట్టిగా తిప్పికొట్టింది. చంద్రయాన్ 1లోని ఇంపాక్టర్ ప్రోబ్ జాబిల్లిపై తాకిడికి గురైన ప్రాంతానికి.. అప్పటి యూపీఏ నేతల జవహర్ పాయింట్ అని ఎందుకు నామకరణం చేశారని నిలదీసింది. తామేమీ భాజపా నాయకుల పేర్లు పెట్టలేదని చురకలు వేసింది. కమలంపార్టీ వ్యాఖ్యలపై స్పందించిన అల్వీ.. విక్రం సారాభాయ్, జవహర్‌లాల్ నెహ్రూ కలిసి ఇస్రోను స్థాపించారని.. అందుకే ల్యాండర్‌కు విక్రం, ప్రోబ్ తాకినప్రాంతానికి జవహర్ పాయింట్ అని పేరుపెట్టినట్లు వివరణ ఇచ్చారు.