ETV Bharat / bharat

Chandrayaan 3 : 'జాబిల్లి' కక్ష్యలోకి 'చంద్రయాన్‌-3'.. ఇక నుంచి చంద్రుడి చుట్టూ చక్కర్లు.. - జాబిల్లి కక్ష్యలోకి చంద్రయాన్ 3

Chandrayaan 3 Lunar Orbit Injection : జాబిల్లిపై పరిశోధనల కోసం భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ISRO) ప్రయోగించిన చంద్రయాన్‌-3 కీలక ఘట్టాన్ని విజయవంతంగా పూర్తి చేసింది. చంద్రుడి కక్ష్యలోకి విజయవంతంగా ప్రవేశించింది. ఇప్పటివరకు భూమి చుట్టూ కక్ష్యలను పూర్తిచేసుకుని, 'ట్రాన్స్‌ లూనార్‌ కక్ష్య'లో జాబిల్లివైపు దూసుకెళ్లిన ఈ వ్యౌమనౌక.. ఇక నుంచి చంద్రుడి చుట్టూ చక్కర్లు కొట్టనుంది.

Chandrayaan 3 Lunar Orbit Injection
Chandrayaan 3 Lunar Orbit Injection
author img

By

Published : Aug 5, 2023, 8:01 PM IST

Updated : Aug 5, 2023, 8:17 PM IST

Chandrayaan 3 Lunar Orbit Injection : జాబిల్లిపై పరిశోధనలకు భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ- ఇస్రో చేపట్టిన చంద్రయాన్‌-3 మిషన్‌లో కీలక ఘట్టం ఆవిష్కృతం అయింది. ఈ వ్యోమనౌక జాబిల్లి కక్ష్యలోకి ప్రవేశించింది. ఇందుకు సంబంధించిన లూనార్‌ ఆర్బిట్‌ ఇంజెక్షన్‌ అనే కీలక విన్యాసాన్ని రాత్రి 7 గంటల సమయంలో ఇస్రో చేపట్టింది. ఫలితంగా చంద్రయాన్‌-3.. జాబిల్లి కక్ష్యలోకి ప్రవేశించింది. మరో 18 రోజులు దీర్ఘవృత్తాకార కక్ష్యల్లో చంద్రుని చుట్టూ తిరగనున్న చంద్రయాన్‌-3 ఈ నెల 23 సాయంత్రం జాబిల్లిపై అడుగుపెట్టనుంది.

Chandrayaan 3 Lunar Orbit Insertion Maneuver : గత నెల 14న ఎల్‌వీఎం3 ఎం-4 రాకెట్‌ ద్వారా చంద్రయాన్‌-3ని భూ కక్ష్యలోకి ప్రవేశపెట్టారు. ఆ తర్వాత మూడు వారాల్లో ఐదుసార్లు కక్ష్యను పెంచుతూ భూమికి దూరంగా వ్యోమనౌకను తీసుకెళ్లారు. ఆగస్టు 1న ట్రాన్స్‌లూనార్‌ ఇంజెక్షన్‌ అనే కీలక విన్యాసంతో ఈ వ్యోమనౌకను చందమామను చేరుకునే మార్గం లునార్‌ ట్రాన్స్‌ఫర్‌ ట్రాజెక్టరీలోకి ప్రవేశపెట్టారు. అలా జాబిల్లి దిశగా పయనించిన వ్యోమనౌకను ఇప్పుడు చంద్రుని కక్ష్యలోకి ఇస్రో ప్రవేశపెట్టింది. మరో 18 రోజుల పాటు దీర్ఘవృత్తాకార కక్ష్యల్లో చంద్రుడి చుట్టూ తిరుగుతూ 100 కిలోమీటర్ల ఎత్తు వరకూ రానున్న చంద్రయాన్ 3 ఈ నెల 23న సాయంత్రం 5 గంటల 47 నిమిషాలకు జాబిల్లిపై దిగనుంది.

  • Chandrayaan-3 Mission:
    “MOX, ISTRAC, this is Chandrayaan-3. I am feeling lunar gravity 🌖”
    🙂

    Chandrayaan-3 has been successfully inserted into the lunar orbit.

    A retro-burning at the Perilune was commanded from the Mission Operations Complex (MOX), ISTRAC, Bengaluru.

    The next… pic.twitter.com/6T5acwiEGb

    — ISRO (@isro) August 5, 2023 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

Chandrayaan 3 Soft Landing On Moon : చంద్రయాన్‌-2 ప్రయోగంలో జాబిల్లిపై ల్యాండర్‌ను మృదువుగా దించడంతో ఇస్రో వైఫల్యం చవిచూసింది. ఆ పొరపాట్ల నుంచి పాఠాలు నేర్చుకుని చంద్రయాన్‌-3 మిషన్‌ను ఇస్రో చేపట్టింది. చందమామ ఉపరితలంపై సురక్షితంగా, మృదువుగా ల్యాండ్‌ అయ్యే సామర్థ్యం భారత్‌కు ఉందని చాటడం, జాబిల్లిపై రోవర్‌ను నడపగలమని రుజువు చేయడం, చంద్రయాన్‌-3లోని పరికరాల ద్వారా.. చంద్రుడి ఉపరితలంపై అక్కడికక్కడే శాస్త్రీయ ప్రయోగాలు నిర్వహించడం ఇస్రో లక్ష్యాలుగా ఉన్నాయి. ఈ ప్రయోగం విజయవంతమైతే చంద్రునిపై సాఫ్ట్‌ ల్యాండింగ్‌ చేసిన దేశంగా అమెరికా, రష్యా, చైనా సరసన భారత్‌ నిలవనుంది.

జాబిల్లికి చేరువలో చంద్రయాన్​-3.. శనివారం మరో కీలక ఘట్టానికి ఇస్రో రెడీ

సరైన దిశలో చంద్రయాన్​-3.. రెండోసారి కక్ష్య మార్పిడి.. ల్యాండింగ్ ఆ సమయానికే..

Last Updated : Aug 5, 2023, 8:17 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.