Chandrababu Responded to His Arrest: తన అరెస్టుపై తెలుగుదేశం అధినేత చంద్రబాబు స్పందించారు. తనను ఇలా అక్రమంగా అరెస్టు చేసిన తీరును తప్పుబట్టారు. అరెస్టు చేయడానికి గల ప్రాథమిక ఆధారాలు చూపాలని.. ఒక వేళ అవి లేకపోతే ప్రాథమిక ఆధారాల్లేకుండా అరెస్టు చేస్తున్నామని రాసివ్వాలన్ని అన్నారు. ఎందుకు అరెస్టు చేస్తున్నారో చెప్పాల్సిన బాధ్యత లేదా.. అసలు నేను ఏ తప్పు చేశానో చెప్పకుండా అరెస్టు చేస్తున్నారు అని మండిపడ్డారు. దీనిపై డీఐజీ స్పందిస్తూ ఏసీబీ కోర్టులో కేసు నమోదైందని.. హైకోర్టు ఆదేశాలు కూడా ఉన్నాయని డీఐజీ చంద్రబాబుకు తెలిపారు. స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో ఈడీ కూడా కొందరిని అరెస్టులు చేసింది.. ఈ ప్రకారమే ఇరెస్టు చేస్తున్నామని అన్నారు. అయితే నాకు ఆ కేసులో ఏ విధంగా సంబంధం ఉందని చంద్రబాబు డీఐజీని ప్రశ్నించారు.
Chandrababu Arrest in Nandyala: నంద్యాలలో చంద్రబాబు అరెస్ట్.. రోడ్డుమార్గంలో చంద్రబాబు తరలింపు
Skill Development Case: రాజకీయ కక్షతోనే కావాలని కేసుల్లో ఇరికిస్తున్నారని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో కొందరికి ముందే నోటీసులు ఇచ్చారు.. కాని నన్ను మాత్రం నేరుగా అరెస్టు చేయటానికి ఎందుకు వచ్చారని పోలీసులను ప్రశ్నించారు. ప్రజా సమస్యలపై పోరాడకుండా ప్రణాళిక ప్రకారం అరెస్టు చేస్తున్నారు.. ఎవరెన్ని కుట్రలు పన్నినా అంతిమంగా న్యాయమే గెలుస్తుందని అన్నారు. ఇప్పటికే కొన్నివందల మందిని అక్రమంగా అరెస్టు చేశారని అన్నారు. కార్యకర్తలు సంయమనం పాటించండని సూచించారు. నా హక్కులు దెబ్బ తీస్తున్నారు.. నాకు న్యాయం జరగే వరకు పోరాడతానని చంద్రబాబు అన్నారు.
చంద్రబాబుకు అనారోగ్యం.. అయినా ఆగని అరెస్టు... జగన్ సైకో పాలనపై నిరసనలు
Chandrababu arrested in Nandyala: నంద్యాలలో తెలుగుదేశం అధినేత చంద్రబాబు బస చేసిన బస్సు వద్దకు పోలీస్ బలగాలు భారీగా వెళ్లడం ఉద్రిక్తతకు దారితీసింది. రాత్రి నంద్యాల బహిరంగసభలో పాల్గొన్న చంద్రబాబు RK ఫంక్షన్ హాల్ వద్ద బస చేశారు. తెల్లవారుజామున రెండున్నర గంటల ప్రాంతంలో అనంతపురం DIG రఘురామిరెడ్డి నేతృత్వంలో పోలీసులు అక్కడికి చేరుకున్నారు. డీఐజీ రఘురామిరెడ్డి, తెలుగుదేశం నాయకుల మధ్య సుదీర్ఘంగా వాగ్వాదం సాగింది. తెల్లవారుజామున చంద్రబాబు కాన్వాయ్ కదులుతుందనే సమాచారం వచ్చిందని అందుకే వచ్చామంటూ రఘురామిరెడ్డి చెప్పారు. అసలు అలాంటిదేమీ లేదని టీడీపీ నేతలు స్పష్టం చేసినా DIG వెనక్కి తగ్గలేదు.
Chandrababu Arrest Tension in AP: రాష్ట్రం వ్యాప్తంగా హై అలర్ట్.. టీడీపీ నేతల హౌస్ అరెస్టులు..
చంద్రబాబు బస వద్దకు పోలీసులు వ్యూహాత్మకంగా చేరుకున్నారు. రాత్రి నుంచే ఆ మేరకు హడావుడి చేశారు. అనంతపురం నుంచి బలగాల్ని నంద్యాలకు రప్పించారు. పోలీసులు హడావుడిని పసిగట్టిన తెలుగుదేశం నాయకులు రాత్రి ఫంక్షన్ హాల్ ఎదుట బైఠాయిచారు. ప్రోటోకాల్ ప్రకారం ఉదయం ఐదున్నరవరకూ VIPని కలిసేందుకు అనుమతి ఇవ్వబోమని NSG సిబ్బంది తేల్చిచెప్పారు. ఉదయం ఐదున్నర తర్వాత వైద్య పరీక్షలు నిర్వహించి ఆ నివేదికను అధికారులకు పంపి అక్కడి నుంచి వచ్చే ఆదేశాల ప్రకారం చంద్రబాబు వద్దకు పంపుతామని NSG కామాండెంట్ స్పష్టం చేశారు. చంద్రబాబుకు వైద్య పరీక్షలు చేయించేందుకు వైద్యుల బృందాన్ని పోలీసులు బస్సు వద్దకు తెచ్చారు.