Chandrababu Responded on Tribal Women Death: విజయనగరం జిల్లా, చిట్టంపాడులో సకాలంలో వైద్యం అందక ఒకే నెలలోనే తల్లి, బిడ్డ మృతి చెందిన ఘటనపై తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబు 'ఎక్స్' (x) ద్వారా స్పందించారు. గిరిజనుడి కుటుంబానికి జరిగిన దారుణం విని చలించిపోయానని చంద్రబాబు తెలిపారు. మృతుడి కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. గత ప్రభుత్వంలో తీసుకువ్చచిన ఫీడర్ అంబులెన్స్‌లను పక్కన పడేసి, గిరిజనుల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు.
ప్రభుత్వ అలసత్వంతో తల్లి, బిడ్డ మృతి: విజయనగరం జిల్లా, చిట్టంపాడు ఘటనపై తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబు స్పందించారు. తీవ్ర అనారోగ్యం పాలైన బాలింతను, ఆరు నెలల చిన్నారిని ఆసుపత్రికి తీసుకువెళ్లేందుకు 5 కిలోమీటర్లు డోలీపై మోసుకు రావాల్సి రావడం దురదృష్టకరమని చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి దుస్థితి రాకూడదనే ఉద్దేశ్యంతో గతంలో ఫీడర్ అంబులెన్స్‌లు తెచ్చినట్లు చంద్రబాబు తెలిపారు. ఫీడర్ అంబులెన్స్‌లను పక్కన పడేసి గిరిజనుల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ తల్లీ, బిడ్డ చనిపోవడానికి కారణం ప్రభుత్వ అలసత్వం కాదా? అంటూ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. కనీసం మనిషి చనిపోయాక కూడా ప్రభుత్వం కనికరించకపోతే ఎలా? అంటూ ఆవేదన వ్యక్తం చేశారు.
మరోసారి పాట పాడబోతున్న పవన్ - సూపర్ అప్డేట్ ఇచ్చిన తమన్
మృతదేహాన్ని తీసుకు వెళ్లడానికి ఒక అంబులెన్స్ కూడా ఏర్పాటు చేయలేరా అంటూ వైఎస్సార్సీపీ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. అంబులెన్సులు ఏమై పోయాయో చెప్పాలన్నారు. పుట్టెడు దుఃఖంలో భార్య మృతదేహాన్ని బైక్ మీద తీసుకువెళ్లాల్సి రావడం ఎంత దయనీయం? ఎంతో బాధాకరమైన విషయం అని తెలిపారు. గిరిజనులకు ఎందుకీ దుస్థితి ? ప్రభుత్వం ఇప్పటికైనా మేల్కొని, ఘటనపై విచారణ జరిపించాలని చంద్రబాబు డిమాండ్ చేశారు. ఆ గిరిజన కుటుంబాన్ని ఆదుకోవాలని ప్రభుత్వానికి సూచించారు. చిట్టంపాడుకు రోడ్డు నిర్మాణాన్ని సత్వరం చేపట్టాలని పేర్కొన్నారు. బాధిత కుటుంబానికి చంద్రబాబు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నట్లు వెల్లడిచారు.
-
విజయనగరం జిల్లా, చిట్టంపాడుకు చెందిన గంగులు కుటుంబానికి జరిగిన దారుణం విని చలించిపోయాను. తీవ్ర అనారోగ్యం పాలైన బాలింతను, ఆరునెలల చిన్నారిని ఆసుపత్రికి తీసుకువెళ్లేందుకు 5 కిలోమీటర్లు డోలీపై మోసుకురావాల్సి రావడం దురదృష్టకరం. ఇలాంటి దుస్థితి రాకూడదనే ఉద్దేశ్యంతో గతంలో ఫీడర్… pic.twitter.com/0f2KheydIy
— N Chandrababu Naidu (@ncbn) January 17, 2024 " class="align-text-top noRightClick twitterSection" data="
">విజయనగరం జిల్లా, చిట్టంపాడుకు చెందిన గంగులు కుటుంబానికి జరిగిన దారుణం విని చలించిపోయాను. తీవ్ర అనారోగ్యం పాలైన బాలింతను, ఆరునెలల చిన్నారిని ఆసుపత్రికి తీసుకువెళ్లేందుకు 5 కిలోమీటర్లు డోలీపై మోసుకురావాల్సి రావడం దురదృష్టకరం. ఇలాంటి దుస్థితి రాకూడదనే ఉద్దేశ్యంతో గతంలో ఫీడర్… pic.twitter.com/0f2KheydIy
— N Chandrababu Naidu (@ncbn) January 17, 2024విజయనగరం జిల్లా, చిట్టంపాడుకు చెందిన గంగులు కుటుంబానికి జరిగిన దారుణం విని చలించిపోయాను. తీవ్ర అనారోగ్యం పాలైన బాలింతను, ఆరునెలల చిన్నారిని ఆసుపత్రికి తీసుకువెళ్లేందుకు 5 కిలోమీటర్లు డోలీపై మోసుకురావాల్సి రావడం దురదృష్టకరం. ఇలాంటి దుస్థితి రాకూడదనే ఉద్దేశ్యంతో గతంలో ఫీడర్… pic.twitter.com/0f2KheydIy
— N Chandrababu Naidu (@ncbn) January 17, 2024
విజయనగరం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం - మినీ లారీ, కారు ఢీకొని ముగ్గురు మృతి
ఇదీ జరిగింది: విజయనగరం జిల్లా శృంగవరపుకోట మండలం బొడ్డవర పంచాయతీ శివారు గిరిశిఖర గ్రామం చిట్టంపాడు గ్రామానికి చెందిన మాదల గంగమ్మ(23) మంగళవారం మధ్యాహ్నం విశాఖ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందింది. ఆమె భర్త గంగులు మృతదేహాన్ని ఆటోలో శృంగవరపుకోట వరకు తీసుకువచ్చాక, గ్రామం వరకు రాలేమంటూ ఆటోవాలా వెనక్కి వెళ్లిపోయాడు. దీంతో పట్టణంలో స్నేహితుల వద్ద ద్విచక్ర వాహనం తీసుకొని వెనుక తమ్ముడిని కూర్చో బెట్టి మధ్యలో భార్య మృతదేహంతో కొండ దిగువ వరకు తీసుకువెళ్లాడు. తిరిగి అక్కడి నుంచి డోలీ కట్టి గ్రామానికి తరలించారు. ఆరు నెలల వయస్సున్న గంగులు కుమారుడు ఈనెల 6వ తేదీన ఆసుపత్రిలో మృతి చెందాడు. ఇప్పుడు భార్య కూడా మరణించడంతో తీవ్ర ఆవేదనకు తీవ్ర ఆవేదనకు గురవుతున్నాడు.
తప్పని డోలీ మోతలు: గ్రామానికి రహదారి సౌకర్యం లేకపోవడం వలన ఈ డోలీ మోతలతో నెట్టుకు రావాల్సి వస్తుందని గిరిజనులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. డోలీ ద్వారా ఆసుపత్రికి తీసుకెళ్లె ప్రయత్నం చేసినప్పటికీ సకాలంలో వైద్యం అందక ప్రాణాలు గాల్లో కలసి పోతున్నాయని గిరిజన సంఘాలు నాయకులు ఆరోపిస్తున్నారు. ఇదే అంశంపై తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబు నాయుడు, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ స్పందించారు.
భార్య మృతదేహం బైక్‌పై తరలింపు - జగన్ అసమర్ధ పాలనకు నిదర్శనం : నారా లోకేశ్