ETV Bharat / bharat

LIVE UPDATES: సీజేఐ ముందుకు చంద్రబాబు క్వాష్‌ పిటిషన్ - cbn sklli case Judgment

Chandrababu Naidu Quash Petition Judgment Today Live Updates: స్కిల్​ డెవలప్​మెంట్​ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు దాఖలు చేసిన క్వాష్‌ పిటిషన్‌ను సుప్రీంకోర్టు ద్విసభ్య ధర్మాసనం చీఫ్​ జస్టిస్​కు నివేదించింది. సెక్షన్‌ 17ఏ అన్వయంపై ఇద్దరు న్యాయమూర్తుల భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. దీంతో తగిన నిర్ణయం కోసం సీజేఐకి నివేదిస్తున్నామని ద్విసభ్య ధర్మాసనం తెలిపింది.

chandrababu naidu quash petition judgment today Live updates

author img

By ETV Bharat Telugu Team

Published : Jan 16, 2024, 12:49 PM IST

Updated : Jan 16, 2024, 1:40 PM IST

Chandrababu Naidu Quash Petition Judgment Today Live Updates : స్కిల్​ డెవలప్​మెంట్​ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు దాఖలు చేసిన క్వాష్‌ పిటిషన్‌ను సుప్రీంకోర్టు ద్విసభ్య ధర్మాసనం చీఫ్​ జస్టిస్​కు నివేదించింది. సెక్షన్‌ 17ఏ అన్వయంపై ఇద్దరు న్యాయమూర్తులు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేశారు.

1:32 PM

సీజేఐకి నివేదిస్తున్నామన్న ద్విసభ్య ధర్మాసనం

  • సీజేఐ ముందుకు చంద్రబాబు స్కిల్‌ కేసు
  • సెక్షన్‌ 17ఏ అన్వయంపై ద్విసభ్య ధర్మాసనంలో భిన్నాభిప్రాయాలు
  • స్కిల్‌ కేసులో చంద్రబాబు క్వాష్‌ పిటిషన్‌పై ద్విసభ్య ధర్మాసనం భిన్నాభిప్రాయాలు
  • సెక్షన్‌ 17ఏ అన్వయంపై ఇద్దరు న్యాయమూర్తుల భిన్నాభిప్రాయాలు
  • 17ఏ నిబంధనలను ఉల్లంఘించారని తీర్పు వెలువరించిన జస్టిస్‌ అనిరుద్ధబోస్‌
  • చంద్రబాబుపై నమోదు చేసిన కేసులు చట్టవిరుద్ధం: జస్టిస్‌ అనిరుద్ధబోస్‌
  • చంద్రబాబుపై కేసుల్లో తగిన అనుమతులు లేకుండా ముందుకెళ్లారు: జస్టిస్‌ అనిరుద్ధబోస్‌
  • కేసుల నమోదుకు ముందు సీఐడీ తగిన అనుమతి తీసుకొని ఉండాల్సింది: జస్టిస్‌ అనిరుద్ధబోస్‌
  • చట్టసవరణ తర్వాత కేసులకే 17ఏ వర్తిస్తుందన్న జస్టిస్‌ త్రివేది
  • తగిన నిర్ణయం కోసం సీజేఐకి నివేదిస్తున్నామన్న ద్విసభ్య ధర్మాసనం
  • సీజేఐకి నివేదిస్తున్నామన్న జస్టిస్‌ అనిరుద్ధబోస్‌, జస్టిస్‌ బేలా ఎం.త్రివేది

1:22 PM

తగిన నిర్ణయం కోసం చీఫ్‌ జస్టిస్‌కు నివేదిస్తున్నాం: జడ్జిలు

  • సెక్షన్‌ 17ఏ అన్వయించడంలో మాకు భిన్నాభిప్రాయాలున్నాయి: జడ్జిలు
  • తగిన నిర్ణయం కోసం చీఫ్‌ జస్టిస్‌కు నివేదిస్తున్నాం: జడ్జిలు
  • భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేసిన ఇద్దరు న్యాయమూర్తులు
  • తదుపరి చర్యల కోసం సీజేఐకి నివేదించిన ద్విసభ్య ధర్మాసనం

1:15 PM

ద్విసభ్య ధర్మాసనంలో భిన్నాభిప్రాయాలు

  • చంద్రబాబు క్వాష్‌ పిటిషన్‌పై సుప్రీంకోర్టు తీర్పు
  • ద్విసభ్య ధర్మాసనంలో భిన్నాభిప్రాయాలు
  • సెక్షన్‌ 17ఏ అంశంపై త్రిసభ్య ధర్మాసనానికి వెళ్లనున్న పిటిషన్‌

1:10 PM

చంద్రబాబు క్వాష్‌ పిటిషన్‌పై తీర్పు చదువుతున్న జడ్జి

  • చంద్రబాబు క్వాష్‌ పిటిషన్‌పై తీర్పు చదువుతున్న జడ్జి
  • తీర్పు వెలువరిస్తున్న జస్టిస్‌ అనిరుద్ధబోస్‌, జస్టిస్‌ బేలా ఎం.త్రివేది ధర్మాసనం

Chandrababu Naidu Quash Petition Judgment Today Live Updates : టీడీపీ అధినేత చంద్రబాబు దాఖలు చేసిన క్వాష్‌ పిటిషన్‌పై సుప్రీంకోర్టు ఈ రోజు తీర్పు వెల్లడించనుంది. కాసేపట్లో జస్టిస్‌ అనిరుద్ధబోస్‌ ఈ తీర్పును వెలువరించనున్నట్లు సమాచారం. అవినీతి నిరోధక చట్టంలోని సెక్షన్‌ 17-ఎ కింద గవర్నర్‌ నుంచి ముందస్తు అనుమతి తీసుకోకుండా ఏపీ సీఐడీ తనపై నమోదు చేసిన స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కేసును కొట్టేయాలంటూ సుప్రీంలో చంద్రబాబు స్పెషల్‌ లీవ్‌ పిటిషన్‌ వేసిన విషయం తెలిసిందే. ఆయన తరఫున సీనియర్‌ న్యాయవాదులు సిద్ధార్థ లూథ్రా, హరీశ్‌ సాల్వే.. సీఐడీ తరఫున ముకుల్‌ రోహత్గీ వాదనలు వినిపించారు. ఈ కేసును జస్టిస్‌ అనిరుద్ధబోస్‌, జస్టిస్‌ బేలా ఎం.త్రివేదిలతో కూడిన ధర్మాసనం విచారించి అక్టోబరు 17న తీర్పు వాయిదా వేసింది.

ఈ అంశంతో ముడిపడిన రెండు కేసుల విచారణ (ఫైబర్‌నెట్ కేసులో ముందస్తు బెయిల్‌ కోసం చంద్రబాబు దాఖలు చేసిన కేసు, స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కేసులో చంద్రబాబుకు బెయిల్‌ ఇస్తూ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను సవాలు చేస్తూ ఏపీ ప్రభుత్వం వేసిన కేసు) ఈ నెల 17, 19వ తేదీల్లో విచారణకు రానున్నందున సుప్రీంకోర్టు వాటికంటే ముందు 17-ఎపై నిర్ణయాన్ని వెలువరించనుంది.

హైకోర్టులో తాను వేసిన క్వాష్‌ పిటిషన్‌ను కొట్టేస్తూ ఏపీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ శ్రీనివాసరెడ్డి గతేడాది సెప్టెంబరు 22న ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ చంద్రబాబు 23న సుప్రీంకోర్టులో స్పెషల్‌ లీవ్‌ పిటిషన్‌ దాఖలు చేశారు.

Last Updated : Jan 16, 2024, 1:40 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.