Chandrababu CID Custody Petition Arguments Complete: ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కేసులో చంద్రబాబును ఐదు రోజులపాటు కస్టడీకి కోరుతూ.. ఏపీ సీఐడీ దాఖలు చేసిన పిటిషన్‌పై వాదనలు ముగిశాయి. రేపు ఉదయం పదకొండున్నరకు దీనిపై ఏసీబీ కోర్టు తీర్పు వెలువరించనుంది. ఈ కేసులో చంద్రబాబు తరఫున సీనియర్ న్యాయవాదులు.. సిద్ధార్థ లూథ్రా, సిద్ధార్థ్ అగర్వాల్ వాదనలు వినిపించారు. సీఐడీ తరుఫున ఏఏజీ పొన్నవోలు సుధాకర్ రెడ్డి వాదనలు వినిపించారు.
Hearing on CID Petition in Vja ACP Court: స్కిల్ డెవలప్మెంట్ కేసులో వచ్చిన ఆరోపణలతో టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని ఆంధ్రప్రదేశ్ సీఐడీ అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో చంద్రబాబును ఐదు రోజుల కస్టడీకి కోరుతూ.. సీఐడీ విజయవాడ ఏసీబీ కోర్టులో పిటిషన్ వేసింది. ఆ పిటిషన్‌పై బుధవారం నాడు కోర్టులో సుదీర్ఘంగా వాదనలు జరిగాయి.
TDP Leader Dhulipalla Narendra on Fiber Grid జగన్ అవినీతిలో స్కిల్ మాస్టర్: ధూళిపాళ నరేంద్ర
Chandrababu Lawyers Arguments in ACP court: విచారణలో భాగంగా చంద్రబాబు నాయుడి తరుఫున సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది సిద్ధార్థ లూథ్రా, మరో సీనియర్ న్యాయవాది సిద్ధార్థ్ అగర్వాల్ కోర్టులో వాదనలు వినిపించగా.. సీఐడీ తరుఫున ఏఏజీ పొన్నవోలు సుధాకర్ రెడ్డి వాదనలు వినిపించారు. ఈ క్రమంలో ముందుగా చంద్రబాబు తరఫున న్యాయవాదులు వినిపిస్తూ.. ''చంద్రబాబును కోర్టులో హాజరుపరిచిన సెప్టెంబర్ 10న సీఐడీ కస్టడీ కోరలేదు. చంద్రబాబును కస్టడీకి కోరుతూ 11న మెమో ఎలా దాఖలు చేస్తారు..?. 24 గంటల్లో దర్యాప్తు అధికారి నిర్ణయం మార్చుకున్నారు. పాత అంశాలతో కస్టడీ ఎలా కోరుతారు. చంద్రబాబును అరెస్టు చేసి విచారణ పేరుతో సీఐడీ ఆఫీసులో ఉంచారు. కొన్ని గంటలపాటు చంద్రబాబును విచారించారు. చంద్రబాబు నుంచి అన్ని విషయాలు రాబట్టామన్నారు. మళ్లీ సీఐడీ కస్టడీకి ఎందుకు అడుగుతున్నారు..?. దర్యాప్తు విషయాలపై సీఐడీ మీడియా సమావేశాలు ఎలా పెడుతుంది..?'' అని ధర్మాసనం ముందు వాదనలు వినిపించారు.
AAG Ponnavolu Sudhakar Reddy Arguments: అనంతరం చంద్రబాబును కస్టడీకి కోరుతూ.. సీఐడీ వేసిన పిటిషన్‌పై ఏఏజీ పొన్నవోలు సుధాకర్ రెడ్డి వాదనలు వినిపిస్తూ.. ''చంద్రబాబును అన్ని ఆధారాలతోనే అరెస్టు చేశారు. కేసుతో ప్రమేయం ఉన్న ప్రతి ఒక్కరినీ మరింత విచారించాలి. కేసులో రికవరీ కంటే కుట్ర కోణాన్ని వెలికితీయడం ముఖ్యం. చంద్రబాబును పూర్తిస్థాయిలో విచారిస్తే మరిన్ని వాస్తవాలు వెలుగులోకి వస్తాయి. స్కిల్ కేసులో నిధులు ఎక్కడెక్కడికి వెళ్లాయో సమాచారం ఉంది. కేసుకు సంబంధించిన పూర్తి వివరాలు రాబట్టాల్సి ఉంది.'' అని వాదించారు. ఈ నేపథ్యంలో ఇరువైపుల వాదనలు విన్న న్యాయస్థానం.. రేపు ఉదయం పదకొండున్నరకు నిర్ణయం వెలువరిస్తామని ప్రకటించింది.