ఆక్సిజన్ కొరతతో కర్ణాటకలోని చామరాజనగర్ జిల్లా ఆసుపత్రిలో 24 గంటల్లోనే 24 మంది ప్రాణాలు కోల్పోవటం కలకలం రేపుతోంది. మరో 50 మందికిపైగా కరోనా రోగులు ప్రాణవాయువు సమస్యను ఎదుర్కొంటున్నారు. ఆక్సిజన్ అందక కలబురగిలోని కేబీఎన్ ఆసుపత్రిలో నలుగురు రోగులు మరణించిన మరుసటి రోజునే ఈ ఘటన జరగటం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. ఆక్సిజన్ కొరతపై ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని రోగుల బంధవులు డిమాండ్ చేశారు.
![Chamarajanagar tragedy](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/kn-cnr-05-video-call-avb-ka10038_03052021121957_0305f_1620024597_290_0305newsroom_1620027709_127.jpg)
మరోవైపు.. ఈ ఘటనలో 24 మంది ఆక్సిజన్ కొరతతోనే చనిపోలేదని, ఇతర కారణాలు ఉన్నాయని చామరాజనగర్ డిప్యూటీ కమిషనర్ రవి పేర్కొన్నారు. ఈ విషయంపై దర్యాప్తు చేపట్టామని, అన్ని నిజాలు తెలుస్తాయన్నారు.
నవ వరుడు మృతి..
చామరాజనగర్ ఆసుపత్రి ఘటనలో ఓ నవ వరుడు ప్రాణాలు కోల్పోయాడు. మైసూర్ జిల్లా దొడ్డహోమ్మ గ్రామానికి చెందిన యువకుడికి రెండు నెలల క్రితం వివాహం జరిగింది. ఇటీవల కరోనా సోకగా.. ఆసుపత్రిలో చేరాడు. ఆసుపత్రిలో ఆక్సిజన్ అయిపోవచ్చిందని ఆదివారం తమ బంధువులతో వీడియో కాల్లో మాట్లాడిన మరుసటి రోజునే మరణించాడు.
![Chamarajanagar tragedy](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/11624963_covid.jpg)
'దోషులపై చర్యలు తీసుకుంటాం'
ఈ విషాద ఘటనకు కారణమైన వారిపై చర్యలు చేపడతామని జిల్లా ఇన్‌ఛార్జి, రాష్ట్ర మంత్రి సురేశ్ కుమార్ తెలిపారు. అన్ని మరణాలకు ఆక్సిజన్ సమస్య కారణం కాదని.. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చూసుకుంటామని హామీ ఇచ్చారు. సరిపడా ఆక్సిజన్ సిలిండర్ల కోసం ఉన్నతాధికారులతో మాట్లాడినట్లు చెప్పారు.
సీఎం యడియూరప్ప విచారం..
చామరాజనగర్ ఆసుపత్రిలో 24 గంటల్లోనే 24 మంది రోగులు ప్రాణాలు కోల్పోవటంపై ముఖ్యమంత్రి యడియూరప్ప విచారం వ్యక్తం చేశారు. ఈ ఘటనపై రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి సుధాకర్‌తో మాట్లాడారు. ఆక్సిజన్ కొరతకు గల కారణాలు, సరఫరా విధానం, అధికారుల మధ్య సమన్వయం వంటి వివరాలను అడిగి తెలుసుకున్నారు. మైసూర్ జిల్లా కలెక్టర్ రోహిణి సింధూరి.. ఆక్సిజన్ సరఫరా కోసం ఏజెన్సీలకు ఆర్డర్ ఇచ్చినప్పటికీ రవాణా చేయలేదని సీఎంకు తెలిపారు మంత్రి. ఈ క్రమంలో.. వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని, సమస్యను నియంత్రించాలని మంత్రితో పాటు జిల్లా ఇంఛార్జి సురేశ్ కుమార్‌ను ఆదేశించారు యడియూరప్ప.
![Chamarajanagar tragedy](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-11622938-422-11622938-1620022498800_0305newsroom_1620027343_841.jpg)
సీఎంతో సమావేశం అనంతరం.. మీడియాతో మాట్లాడారు ఆరోగ్య మంత్రి సుధాకర్. చామరాజనగర్ జిల్లాలో ఆక్సిజన్ కొరతకు మైసూర్, చామరాజనగర్ జిల్లాల అధికారులదే బాధ్యతని తెలిపారు. ఇరు జిల్లాల అధికారుల మధ్య సమన్వయం లేకనే కొరతకు దారితీసినట్లు పేర్కొన్నారు. ఈ సమస్యను పరిష్కరించేందుకు కృషి చేస్తున్నట్లు చెప్పారు.
కాంగ్రెస్ విమర్శలు..
చామరాజనగర్ ఆసుపత్రి ఘటనకు అధికార భాజపానే కారణమని ఆరోపించింది కాంగ్రెస్. ఇంకా ఎంతమంది ప్రాణాలు కోల్పోవాలి అని ట్విట్టర్ వేదికగా ప్రశ్నించారు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ. మృతుల కుటుంబాలకు సంతాపం తెలిపారు.
-
Died or Killed?
— Rahul Gandhi (@RahulGandhi) May 3, 2021 " class="align-text-top noRightClick twitterSection" data="
My heartfelt condolences to their families.
How much more suffering before the ‘system’ wakes up? pic.twitter.com/JrfZbIo7zm
">Died or Killed?
— Rahul Gandhi (@RahulGandhi) May 3, 2021
My heartfelt condolences to their families.
How much more suffering before the ‘system’ wakes up? pic.twitter.com/JrfZbIo7zmDied or Killed?
— Rahul Gandhi (@RahulGandhi) May 3, 2021
My heartfelt condolences to their families.
How much more suffering before the ‘system’ wakes up? pic.twitter.com/JrfZbIo7zm
" చనిపోయారా? చంపేశారా? మృతుల కుటుంబాలకు నా సంతాపం. వ్యవస్థ మేల్కొనే లోపు ఇంకా ఎంతమంది ప్రాణాలు కోల్పోవాలి? "
- రాహుల్ గాంధీ, కాంగ్రెస్ అగ్ర నేత
ఆరోగ్య మంత్రిని అరెస్ట్ చేయాలి: సుర్జేవాలా
24 మంది ప్రాణాలు కోల్పోయిన ఘటనపై తీవ్రంగా స్పందించారు ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి, కర్ణాటక ఇంఛార్జి రణ్‌దీప్ సింగ్ సుర్జేవాలా. ఆరోగ్య శాఖ మంత్రిని అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. 'యడియూరప్ప ప్రభుత్వం తయారు చేసిన నిర్లక్ష్యపు హత్య ఇది! ఆరోగ్య మంత్రి వెంటనే రాజీనామా చేయాలి. ఈ మరణాలకు సీఎం యడియూరప్ప జీ బాధ్యత వహిస్తారా? ' అని ట్వీట్ చేశారు.
ప్రభుత్వం కేవలం పబ్లిసిటీపైనే దృష్టిసారించిందని, ఎలాంటి బాధ్యత లేదని ఆరోపించారు కర్ణాటక కాంగ్రెస్ అధ్యక్షుడు డీకే శివకుమార్. శాసనసభాపక్ష సమావేశం అనంతరం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని కలుస్తామన్నారు. ప్రజల ముందు నిజాలను ఉంచాలని కోరుతామని తెలిపారు.
ఇదీ చూడండి: 'అత్యవసర ఆక్సిజన్ నిల్వల కోసం ఏర్పాట్లు చేయండి'