యోగా గురు బాబా రాందేవ్కు చెందిన పతంజలి ఆయుర్వేద డైయిరీ సంస్థల సీఈఓ సునీల్ బన్సల్.. కరోనా సంబంధిత సమస్యలతో ప్రాణాలు కోల్పోయారు. చికిత్స పొందుతూ మే 19న రాజస్థాన్ జైపుర్లోని ఓ ఆసుపత్రిలో మృతి చెందారు. అల్లోపతి ఔషధాలపై బాబా రాందేవ్ ఇటీవల చేసిన వ్యాఖ్యలు వివాదాస్పమైన క్రమంలో ఆయన మృతి వెలుగులోకి రావటం గమనార్హం.
కరోనాతో తీవ్రంగా ప్రభావితమైన సునీల్ బన్సల్(57)కు ఊపిరితిత్తులు, మెదడు రక్తనాళాల్లో సమస్య ఏర్పడింది. దాంతో.. ఆయన చనిపోయారని జైపుర్లోని ఆస్పత్రి వర్గాలు తెలిపాయి. డెయిరీ రంగంలో పేరు ప్రఖ్యాతలు సంపాదించిన బన్సల్.. 2018లో పతంజలి డెయిరీ బిజినెస్ బాధ్యతలను చేపట్టారు. ఆయన సారథ్యంలో ఈ సంస్థ మంచి ఫలితాలు నమోదు చేసింది.
ఇదీ చూడండి: 'వైద్యశాస్త్రంపై రాందేవ్కు దురుద్దేశమేమీ లేదు'