ETV Bharat / bharat

పార్టీ మారిన నేతకు వీఐపీ భద్రత కట్​! - టీఎంసీలో చేరిన భాజపా ఎమ్మెల్యే ముకుల్ రాయ్ వార్తలు

భాజపాను వీడి ఇటీవలే తృణమూల్​ కాంగ్రెస్​లో చేరిన ఎమ్మెల్యే ముకుల్ రాయ్​కు వీఐపీ భద్రతను ఉపసంహరించింది కేంద్రం. ఆయన కుమారుడు సుబ్రంగ్షుకు అందిస్తున్న సీఐఎస్​ఎఫ్​ భద్రతనూ తొలగిస్తున్నట్లు తెలిపింది.

Mukul Roy
ముకుల్ రాయ్
author img

By

Published : Jun 17, 2021, 1:09 PM IST

బంగాల్ ఎన్నికల అనంతరం భాజపాను వీడి సొంతగూటికి చేరిన ఎమ్మెల్యే ముకుల్ రాయ్​కు వీఐపీ భద్రతను కేంద్రం తొలగించింది. ఈ మేరకు రాయ్​కు అందిస్తున్న జెడ్ కేటగిరీ భద్రతా విధుల నుంచి వైదొలగాల్సిందిగా కేంద్ర హోంశాఖ సీఆర్‌పీఎఫ్​ను ఆదేశించింది. అలాగే రాయ్ కుమారుడు సుబ్రంగ్షుకు సీఐఎస్ఎఫ్ అందిస్తున్న భద్రతను సైతం ఉపసంహరించినట్లు అధికార వర్గాలు తెలిపాయి.

ఈ ఏడాది బంగాల్ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ఆయనకు సీఆర్‌పీఎఫ్ భద్రతను ఏర్పాటు చేసింది కేంద్రం. 22-24 మంది సాయుధలైన కమాండోలు ఆయన వెంట ఉండేవారు.

అయితే... తనకు వీఐపీ భద్రత అవసరం లేదని కేంద్రానికి ముకుల్ రాయ్ లేఖ రాశారని, అందుకు అనుగుణంగా ప్రభుత్వం చర్యలు చేపట్టిందని సమాచారం.

వీడిన వారంలోపే..!

ముకుల్​ రాయ్ తన కుమారుడు సుబ్రంగ్షుతో కలిసి గతవారమే బంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఆధ్వర్యంలో టీఎంసీలో చేరారు. కృష్ణానగర్ ఉత్తర నియోజకవర్గానికి ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్నారు. వీరికి ప్రస్తుతం రాష్ట్ర పోలీసులు భద్రత కల్పిస్తున్నారు.

ఇవీ చదవండి: టీఎంసీలోకి తిరిగొచ్చిన ముకుల్​ రాయ్​

కీలక నేతల 'ఘర్​ వాప్సీ'- అయోమయంలో భాజపా

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.