ETV Bharat / bharat

'కేంద్రం, దిల్లీ ప్రభుత్వాలు పంతం వీడాలి'

కేంద్రం, దిల్లీ ప్రభుత్వాల మధ్య తరచూ వివాదాలు తలెత్తడంపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. 'రెండు ప్రభుత్వాలు పంతం నీదా నాదా' అనే వైఖరి అవలంబిస్తున్నాయని పేర్కొంది. ఫలితంగా పరిపాలనా పరంగా సమస్యలు తలెత్తుతున్నాయంది. ఇలా జరగకుండా రాజ్యాంగ విభజన అధికారాలకు అనుగుణంగా కేంద్రం, దిల్లీ సర్కార్​ సమన్వయంతో ముందుకు సాగాలని హితవు పలికింది.

Centre, Delhi seem to have adopted 'my way or high way' approach: SC
కేంద్రం, దిల్లీ ప్రభుత్వంపై సుప్రీం కీలక వ్యాఖ్యలు
author img

By

Published : Jul 9, 2021, 8:47 PM IST

కేంద్రంలోని నరేంద్ర మోదీ సర్కార్​కు, దిల్లీ ప్రభుత్వానికి మధ్య గత కొన్నేళ్లుగా తరచూ విభేదాలు తలెత్తున్నాయి. అనేక విషయాల్లో ఏకాభిప్రాయం కుదరక పాలనాపరమైన సమస్యలు ఎదురవుతున్నాయి. ఈ విషయం సుప్రీంకోర్టు దృష్టికి వచ్చింది. ఇరు పక్షాలు 'పంతం నీదా నాదా' అనే వైఖరి అవలంబిస్తున్నాయని గురువారం ఓ తీర్పు వెలువరిస్తూ వ్యాఖ్యానించింది. మొండిపట్టును వీడి రెండు ప్రభుత్వాలు పరస్పర సహకారంతో ముందుకు సాగాలని సూచించింది.

ఈశాన్య దిల్లీ అల్లర్ల కేసుకు సంబంధించి సాక్షిగా తమ ముందు హాజరుకానందుకు దిల్లీ ప్రభుత్వం సమన్లు జారీ చేయడాన్ని సుప్రీంకోర్టులో సవాల్ చేశారు ట్విట్టర్ ఇండియా వైస్ ప్రెసిడెంట్​, ఎండీ అజిత్​ మోహన్​. అయనతో పాటు మరికొందరు పిటిషన్ దాఖలు చేసిన వారిలో ఉన్నారు. దీనిపై విచారణ జరిపిన న్యాయస్థానం వ్యాజ్యాలను తిరస్కరించింది. సభ్యులతో పాటు ఇతరులను తమ ముందు హాజరుకావాలనే అధికారం దిల్లీ శాసనసభ, దాని కమిటీకి ఉందని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఈ తీర్పు సందర్భంగానే కేంద్రం, దిల్లీ ప్రభుత్వాల మధ్య సుదీర్ఘకాలంగా జరుగుతున్న వివాదాలపై కీలక వ్యాఖ్యలు చేసింది.

ఆధిపత్య పోరు..

అధికారంలో పైచేయి సాధించాలని కేంద్రం, దిల్లీ ప్రభుత్వాల మధ్య 2014నుంచి ఆధిపత్య పోరు సాగుతోంది. 2018లో అప్పటి సీజేఐ జస్టిస్​ దీపక్ మిశ్రా.. దిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్​కు స్వతంత్ర నిర్ణయాధికారాలు లేవని, ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వ సూచనలకు అనుగుణంగా నడుచుకోవాలని సూచించారు. అయితే ప్రస్తుతం ఇచ్చిన తీర్పులో దిల్లీ, కేంద్ర ప్రభుత్వాలు సమన్వయంతో పాలన సాగించాలని సుప్రీం పేర్కొంది. రాజ్యాంగంలోని విభజన అధికారాలను గుర్తించాలని ఆప్​ ప్రభుత్వానికి సూచించింది.

అలాగే కేంద్రం కూడా దిల్లీలో ఏ పార్టీ అధికారంలో ఉన్నా పరస్పర సహకారం అందించాలని సర్వోన్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. ఈ విషయాన్ని అర్థం చేసుకునే పరిపక్వత ఇరువైపులా ఉండాలంది. అయితే ఆ పరిపక్వత కన్పించడం లేదని వ్యాఖ్యానించింది. సరిగ్గా పని చేయాలంటే కేంద్రం, దిల్లీ సర్కార్..​ చేతిలో చెయ్యేసినట్లుగా ముందుకు సాగాలని సుప్రీం పేర్కొంది. లేదంటే కనీసం పక్కపక్కన నడుస్తూ వెళ్తున్నట్లైనా ప్రవర్తించాలంది.

లోక్​సభ ఎన్నికల్లో మొత్తం ఏడు సీట్లలో కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీని ప్రజలు గెలిపించారని, అసెంబ్లీ ఎన్నికలకు వచ్చే సరికి రాష్ట్రంలో అధికారంలో ఉన్న పార్టీకి పట్టం గట్టారని సుప్రీం గుర్తు చేసింది. ఇది ఓటర్ల పరిపక్వతకు నిదర్శనమని, రెండు ప్రభుత్వాల పాత్రలు భిన్నమని అర్థం చేసుకునే తీర్పు ఇలా ఇచ్చారని వివరించింది. అయితే రెండు ప్రభుత్వాలు ఈ విషయాన్ని గుర్తించడలేకపోవడం బాధాకరమంది.

మొత్తం 188 పేజీల తీర్పును వెలువరిస్తూ.. దిల్లీలో జరిగిన హింసాత్మక ఘటన దురదృష్టకరమని జస్టిస్ కౌల్ అన్నారు. ఈ సంఘటనను చట్టపరమైన, సామాజిక దృక్పథంతో చూడవలసిన అవసరం ఉందన్నారు. ఈ నేపథ్యంలోనే శాంతి, సామరస్య కమిటీని ఏర్పాటు చేయాలని దిల్లీ అసెంబ్లీ కోరిందని తీర్పు చెప్పారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.