ETV Bharat / bharat

ఆస్పత్రుల భద్రతపై రాష్ట్రాలకు కేంద్రం లేఖ

author img

By

Published : Nov 30, 2020, 4:21 PM IST

ఆసుపత్రుల్లో అగ్నిప్రమాదాలు జరగకుండా చర్యలు తీసుకోవాలని కేంద్రం ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు కేంద్ర హోం మంత్రిత్వ శాఖ కార్యదర్శి అజయ్​ కుమార్ భల్లా లేఖ రాశారు.

Centre asks states, UTs to ensure fire safety measures in hospitals
'అగ్ని ప్రమాదాలపై రాష్ట్రాలకు కేంద్రం లేఖ'

ఆసుపత్రులు, నర్సింగ్​ హోమ్స్​లో అగ్ని ప్రమాదాలు జరగకుండా రాష్ట్రాలు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని కేంద్రం సూచించింది. కొవిడ్ ఆస్పత్రుల్లో వరుస ప్రమాదాల నేపథ్యంలో అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు కేంద్ర హోం మంత్రిత్వ శాఖ కార్యదర్శి అజయ్​ కుమార్ భల్లా ఈ మేరకు లేఖ రాశారు.

" దేశం మొత్తం కరోనా మహమ్మారితో పోరాడుతున్న సమయంలో ఆసుపత్రుల్లో అగ్ని ప్రమాదాలు సంభవించకుండా చర్యలు తీసుకోవాలి. అగ్నిమాపక చర్యలపై సమీక్షించుకోవాలి."

--కేంద్ర హోం మంత్రిత్వ శాఖ కార్యదర్శి అజయ్​ కుమార్ భల్లా

ఆసుపత్రుల్లో తీసుకోవాల్సిన భద్రతా చర్యలపై జాతీయ విపత్తు నిర్వాహణ ప్రాధికార సంస్థ(ఎన్​డీఎంఏ) నిర్దేశించిన మార్గదర్శకాలను సైతం లేఖలో వివరించారు.

ఇటీవల గుజరాత్​లోని రాజ్​కోట్​, అహ్మదాబాద్​ ఆసుపత్రుల్లో అగ్ని ప్రమాదాలు జరిగి 14 మంది మరణించారు.

ఇదీ చదవండి: ఆసుపత్రిలో అగ్నిప్రమాదం- 8 మంది కొవిడ్​ రోగులు మృతి

ఇదీ చదవండి: కొవిడ్​ ఆసుపత్రిలో అగ్ని ప్రమాదం- ఆరుగురు మృతి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.