కరోనా తీవ్రత నేపధ్యంలో ఉద్యోగులకు ఊరట కల్పిస్తూ కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కేంద్ర ప్రభుత్వంలో పనిచేస్తున్న గర్భిణులు, వికలాంగ ఉద్యోగులు ఇంటి నుంచే పని చేసే వెసులుబాటు కల్పిస్తూ ఉత్తర్వులు విడుదల చేసింది సిబ్బంది, శిక్షణ వ్యవహారాల శాఖ- డీఓపీటీ.
కంటైన్‌మెంట్ జోన్‌లో నివసించే ఉద్యోగులు, అధికారులకు కూడా ఈ మినహాయింపు వర్తిస్తుందని డీఓపీటీ తెలిపింది. కార్యాలయానికి విధులకు హాజరయ్యే అధికారులు, ఉద్యోగులు కొవిడ్ నియమాలను తప్పక పాటించాలని ఆదేశించింది. మే 31 వరకు ఈ ఉత్తర్వులు అమలులో ఉంటాయని పేర్కొంది.
ఇదీ చదవండి:'24 గంటలు కాలేదు.. అప్పుడే రాష్ట్రపతి పాలనా?