ETV Bharat / bharat

Central Vista: 'ఆడంబరం కాదు.. అత్యవసర ప్రాజెక్టు'

సెంట్రల్ విస్టా ప్రాజెక్టు ఆడంబరం కోసం నిర్మించడం లేదని కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పురీ పేర్కొన్నారు. ఇది అత్యవసర ప్రాజెక్టు అని చెప్పారు. దీనిపై తప్పుడు కథనాలు సృష్టిస్తున్నారని అన్నారు. ప్రధాని నివాసానికి సంబంధించి తుది డిజైన్ ఖరారు కాలేదని స్పష్టం చేశారు.

Central Vista: Union Minister Puri hits out at opposition, says false narrative being created
Central Vista: 'ఆడంబరం కాదు.. అత్యవసర ప్రాజెక్టు'
author img

By

Published : May 31, 2021, 5:01 PM IST

సెంట్రల్ విస్టా ప్రాజెక్టుపై తప్పుడు కథనాలు సృష్టిస్తున్నారని విపక్షాలపై కేంద్ర గృహ, పట్టణ వ్యవహారాల మంత్రి హర్దీప్ సింగ్ పూరీ మండిపడ్డారు. ఈ ప్రాజెక్టు ఆడంబరం కోసం కాదని, అత్యవసరమని అన్నారు. ప్రధానమంత్రి నివాసానికి సంబంధించి ఎలాంటి డిజైన్ ఖరారు కాలేదని చెప్పారు. పార్లమెంట్ భవనం, సెంట్రల్ విస్టా అవెన్యూ నిర్మాణం మాత్రమే కొనసాగుతున్నట్లు స్పష్టం చేశారు. రూ. 1300 కోట్లతో ఈ పనులు జరుగుతున్నాయని వివరించారు.

"సెంట్రల్ విస్టా ప్రాజెక్టుపై తప్పుడు కథనాలు నా దృష్టికి వచ్చాయి. ఈ ప్రాజెక్టులో భాగంగా ఏ ఇతర వారసత్వ భవనాన్ని మేం ముట్టుకోలేదు. ఇది ఆడంబర ప్రాజెక్టు కాదు. అత్యవసర ప్రాజెక్టు."

-హర్దీప్ సింగ్ పురీ, కేంద్ర మంత్రి

సెంట్రల్ విస్టా ప్రాజెక్టు నిర్మాణాన్ని కొనసాగించవచ్చని దిల్లీ హైకోర్టు సోమవారం ఆదేశాలు జారీ చేసింది. కరోనా విజృంభణ నేపథ్యంలో ఈ ప్రాజెక్టును నిలిపివేయాలని దాఖలైన పిటిషన్​ను రూ. లక్ష జరిమానా విధించి కొట్టేసింది.

ఇదీ చదవండి- వ్యాక్సినేషన్​పై కేంద్రానికి సుప్రీం ప్రశ్నలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.