సెంట్రల్ విస్టా ప్రాజెక్టు(Central Vista) పనులను కొనసాగించవచ్చని దిల్లీ హైకోర్టు తీర్పు వెలువరించింది. దీనిని అత్యవసర ప్రాజెక్ట్‌గా హైకోర్టు అభివర్ణించింది. కొత్త పార్లమెంట్ నిర్మాణ పనులు నిలిపివేయాలన్న పిటిషన్‌ను జస్టిస్ డీఎన్ పాటిల్, జస్టిస్ జ్యోతి సింగ్‌లతో కూడిన ధర్మాసనం తిరస్కరించింది. పిటిషన్‌లో ప్రజాప్రయోజనం ఏమీ లేదని వివరిస్తూ.. పిటిషనర్‌కు రూ.లక్ష జరిమానా విధించింది.
దేశవ్యాప్తంగా కరోనా పరిస్థితుల నేపథ్యంలో కేంద్రం చేపట్టిన (కొత్త పార్లమెంట్)సెంట్రల్ విస్టా ప్రాజెక్టు(Central Vista) నిర్మాణ పనులు వెంటనే నిలిపివేయాలని కోరుతూ దిల్లీ హైకోర్టులో పలు పిటిషన్లు దాఖలయ్యాయి.
ఇదీ చదవండి : 'సోలీ సొరాబ్జీ సేవలు మకుటాయమానం'