ETV Bharat / bharat

వచ్చే జనవరిలో సీ-టెట్​ పరీక్ష - CTET new exam date

కరోనా వల్ల వాయిదా పడిన సెంట్రల్​ టీచింగ్ ఎలిజిబిలిటీ టెస్ట్(సీ-టెట్​) పరీక్షను వచ్చే ఏడాది జనవరి 31న నిర్వహించనున్నారు. ఈ మేరకు కేంద్ర విద్యాశాఖ మంత్రి రమేశ్​ పొఖ్రియాల్​ వెల్లడించారు.

Central Teacher Eligibility Test to be held on Jan 31, 2021: Minister
వచ్చే ఏడాది జనవరిలో సీ-టెట్​ పరీక్ష
author img

By

Published : Nov 4, 2020, 9:56 PM IST

కరోనా మహమ్మారి వల్ల వాయిదా పడిన సెంట్రల్​ టీచింగ్​ ఎలిజిబిలిటీ టెస్ట్​(సీ-టెట్​)ను వచ్చే ఏడాది జనవరిలో నిర్వహించనున్నట్లు కేంద్ర విద్యాశాఖ మంత్రి రమేశ్​ పొఖ్రియాల్​ వెల్లడించారు.

112 నగరాల్లో ఈ ఏడాది జులై 5న జరగాల్సిన 14వ ఎడిషన్​ సీ-టెట్ పరీక్షకు.. కరోనా కారణంగా పర్యవేక్షణ సంబంధించి కొన్ని సమస్యలు తలెత్తాయి. దీంతో పరీక్షను వాయిదా వేశారు అధికారులు. అయితే కరోనా నిబంధనలకు అనుగుణంగా 135 కేంద్రాల్లో వచ్చే ఏడాది జనవరి 31న పరీక్ష నిర్వహించనున్నట్లు పొఖ్రియాల్​ స్పష్టం చేశారు.

అభ్యర్థుల నుంచి భారీ సంఖ్యలో వచ్చిన అభ్యర్థనల మేరకు పరీక్షా కేంద్రాలను మార్చుకునే అవకాశం వారికి కల్పించినట్లు సెంట్రల్ బోర్డ్​ ఆఫ్​ సెకండరీ ఎడుకేషన్​ (సీబీఎస్​సీ) తెలిపింది. వైరస్ వ్యాప్తి కొనసాగుతున్న నేపథ్యంలో అభ్యర్థుల సమస్యలను దృష్టిలో ఉంచుకొని ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు తెలిపారు.

'అభ్యర్థులు ఎంపిక చేసుకున్న నాలుగు నగరాల్లో పరీక్షా కేంద్రాలను కేటాయించడానికి ప్రయత్నిస్తాం. ఏదైనా పరిస్థితుల తలెత్తినట్లయితే వారు ఎంచుకున్న నగరంలో కాకుండా వేరే నగరాల్లో కూడా పరీక్షా కేంద్రాలను కేటాయించవచ్చ'ని ఓ సీనియర్​ అధికారి వెల్లడించారు.

ఇదీ చూడండి: మోదీ మెచ్చిన మాస్క్​లు తయారు చేసిందెవరు?

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.