Central Govt on Ap State Capital Amaravati: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని అంశంపై కేంద్ర ప్రభుత్వం మరోసారి స్పష్టతనిచ్చింది. ఏపీ రాజధాని అమరావతే అని వెల్లడించింది. ఈ మేరకు రాజ్యసభలో మంగళవారం కేంద్ర పట్టణాభివృద్ధి సహాయ మంత్రి కౌశల్ కుమార్ రాతపూర్వకంగా సమాధానం ఇచ్చారు. దీంతోపాటు దేశవ్యాప్తంగా 28 రాష్ట్రాల్లో కేవలం త్రిపుర, నాగాలాండ్ రాష్ట్రాలకు మాత్రమే మాస్టర్ ప్లాన్‌లు లేవని, మిగతా అన్ని రాష్ట్రాలకు కూడా మాస్టర్ ప్లాన్‌లు ఉన్నాయని ఆయన స్పష్టం చేశారు. వీటిని కేంద్ర ప్రభుత్వం కూడా ఆమోదించిందన్న మంత్రి కౌశల్ కుమార్ అమరావతికి సైతం మాస్టర్ ప్లాన్ ఉందని, దీనిని కూడా కేంద్రం ప్రభుత్వం ఆమోదించిందని ఆయన తెలిపారు.
Central Govt on 28 State Capitals Master Plan: దేశ రాజధాని దిల్లీలో నేటి నుంచి పార్లమెంటు శీతాకాల సమావేశాలు ప్రారంభమైన విషయం తెలిసిందే. సమావేశాల్లో భాగంగా రాజ్యసభలో 28 రాష్ట్రాల రాజధానులకు సంబంధించిన మాస్టర్ ప్లాన్ అంశంపై లేవనెత్తిన ప్రశ్నలకు కేంద్రం సమాధానాలు ఇచ్చింది. ఈ సందర్భంగా కేంద్ర పట్టణాభివృద్ది సహాయ మంత్రి కౌశల్ కుమార్ ఏపీ రాజధాని అమరావతే అని స్పష్టం చేశారు. రాజధానుల అంశంపై ఆయన రాతపూర్వకంగా సమాధానాలు ఇచ్చారు. అందులో ప్రధానంగా ఏపీ రాజధాని అమరావతే అన్న విషయాన్ని స్పష్టంగా వివరించారు.
High Court on R5 Zone: ఏపీ ప్రభుత్వానికి ఎదురుదెబ్బ.. ఆర్-5 జోన్‌లో ఇళ్ల నిర్మాణంపై హైకోర్టు స్టే
Union Minister Kaushal Kumar on AP Capital Issue: "ఏపీకి రాజధాని అమరావతే. 28 రాష్ట్రాల రాజధానులకు మాస్టర్ ప్లాన్ ఉంది. ఇప్పటికే రాజధానుల పేర్లతో కేంద్రం ఆ వివరాలను వెల్లడించింది. అమరావతికి సైతం మాస్టర్ ప్లాన్ ఉంది. మాస్టర్ ప్లాన్ ఆమోదం పొందిన వాటిలో అమరావతి కూడా ఉంది. రాష్ట్రాల రాజధానులకు మాస్టర్ ప్లాన్ లేదన్న మాట అవాస్తవం. ఏపీ రాజధాని అమరావతి సహా 26 రాష్ట్రాల రాజధానులకు మాస్టర్ ప్లాన్ ఉన్నాయి. త్రిపుర రాజధాని అగర్తల, నాగాలాండ్ రాజధాని కోహిమా మినహా మిగతా రాజధానుల మాస్టర్ ప్లాన్‌లను ఆమోదించాం'' అని రాజ్యసభకు ఇచ్చిన సమాధానంలో కేంద్ర పట్టణాభివృద్ది సహాయ మంత్రి కౌశల్ కుమార్ తెలియజేశారు.
Union Minister Nithyanandarai on AP Capital: ఆంధ్రప్రదేశ్ రాజధాని అంశంపై గత సంవత్సరం (03 Feb 2022) జరిగిన పార్లమెంట్ సమావేశాల్లో బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు లేవనెత్తిన ప్రశ్నలకు కేంద్ర ప్రభుత్వం సమాధానాలు ఇచ్చింది. ఏపీ రాజధాని అమరావతే అనే స్పష్టతనిచ్చింది. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి నిత్యానందరాయ్ సమాధానమిస్తూ ప్రస్తుతం ఏపీకి రాజధాని అమరావతే అని చెప్పారు. అయితే, రాజధానిని నిర్ణయించే అధికారం రాష్ట్రానిదేనన్నారు. మూడు రాజధానులపై రాష్ట్ర ప్రభుత్వం వెనక్కి తగ్గినట్లు తమ దృష్టికొచ్చిందని ఆయన రాజ్యసభలో చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం 2015లోనే దీన్ని ప్రకటించినప్పటికీ, 2020లో మూడు రాజధానుల చట్టాన్ని తీసుకొచ్చి తర్వాత ఉపసంహరించుకుందని ఆయన గుర్తు చేశారు. ఇప్పుడు మాత్రం అమరావతే రాజధానిగా ఏపీ ప్రభుత్వం తెలియజేసిందని మంత్రి నిత్యానందరాయ్ రాజ్యసభలో వివరించారు.