ETV Bharat / bharat

విదేశాల నుంచి నేరుగా రాష్ట్రాలకు కొవిడ్​ సాయం!

కరోనా మహమ్మారిపై పోరులో భాగంగా విదేశాల నుంచి వచ్చే సాయాన్ని రాష్ట్రాలు నేరుగా పొందే వెసులుబాటును కేంద్రం కల్పించింది. కొనుగోలు రూపంలో, లేదా విరాళాల ద్వారా సామగ్రిని సమీకరించుకొనేందుకు ఒక నోడల్ అధికారిని రాష్ట్రాలు నియమించుకోవాల్సి ఉంటుందని స్పష్టం చేసింది.

foreign
విదేశాల నుంచి నేరుగా రాష్ట్రాలకు సాయం!
author img

By

Published : May 11, 2021, 6:05 AM IST

Updated : May 11, 2021, 6:47 AM IST

కరోనా మహమ్మారిని మరింత సమర్థంగా ఎదుర్కొనేందుకు వీలుగా విదేశాల నుంచి సాయాన్ని రాష్ట్రాలు నేరుగా అందుకునే వెసులుబాటు కల్పించాలని కేంద్రం నిర్ణయించింది. ఉచిత పంపిణీ నిమిత్తం.. కొనుగోలు రూపంలో, లేదా విరాళాల ద్వారా సామగ్రిని సమీకరించుకొనేందుకు ఒక నోడల్ అధికారిని మాత్రం రాష్ట్రాలు నియమించుకోవాల్సి ఉంటుంది. కేంద్ర మార్గదర్శకాల ప్రకారం రాష్ట్ర ప్రభుత్వాలు మన దేశంలోని విదేశీ రాయబార కార్యాలయాలను సంప్రదించి నేరుగా కరోనా సంబంధిత సామగ్రి సమీకరణకు వివరాలు తెలుసుకోవచ్చు. వీటిపై కస్టమ్స్ సుంకం, ఐజీఎస్​టీ వంటి వాటి నుంచి మినహాయింపులు పొందేందుకు వీలుంది. నిరభ్యంతర ధ్రువీకరణ పత్రాలు తీసుకోవాల్సిన పనిలేదు.

నాలుగు జాతీయ సర్వేల నిలుపుదల

వలస కార్మికులు, ఇళ్లలో పనిచేసేవారిపై చేపట్టదలచిన జాతీయస్థాయి సర్వేలను నిలిపివేయాలని కేంద్రం నిర్ణయించింది. రవాణా రంగం కల్పించిన ఉద్యోగాలు, దేశంలోని వృత్తి నిపుణుల సంబంధిత వివరాలను సేకరించే సర్వేలనూ ప్రస్తుతానికి పక్కన పెట్టింది. దేశంలో నెలకొన్న కరోనా పరిస్థితుల నేపథ్యంలో వివరాల సేకరణకు క్షేత్రస్థాయికి వెళ్లే అవకాశాల్లేక ఈ నిర్ణయానికి వచ్చింది. పరిస్థితులు మెరుగుపడ్డాక వీటిని చేపడతారు. ఈ సర్వేలన్నీ ఈ ఏడాది నవంబరు నాటికి పూర్తి కావాల్సి ఉన్నాయి.

ఇదీ చూడండి: పుదుచ్చేరి అసెంబ్లీకి ముగ్గురు నామినేట్​

ఇదీ చూడండి: వైద్య సామగ్రిని తీసుకొచ్చిన భారత 'యుద్ధ నౌకలు'

Last Updated : May 11, 2021, 6:47 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.