కొవిడ్-19 నివారణకు రూపొందిన కొవాగ్జిన్, కొవిషీల్డ్ టీకాలతో కూడిన మిశ్రమ డోసులపై ప్రయోగాలు నిర్వహించేందుకు అనుమతినివ్వాలని కేంద్ర ఔషధ ప్రమాణాల నియంత్రణ సంస్థలోని నిపుణుల కమిటీ.. ప్రభుత్వానికి సిఫార్సు చేసింది. తమిళనాడులోని క్రిస్టియన్ మెడికల్ కాలేజీ (సీఎంసీ)లో ఈ ప్రయోగాలు జరుగుతాయి. ఓ వ్యక్తికి ఒక డోసు కొవాగ్జిన్‌ను, మరో డోసు కొవిషీల్డ్‌ను ఇవ్వవచ్చా అన్నది పరిశీలించడం దీని ఉద్దేశం. ఆరోగ్యంగా ఉన్న 300 మంది వాలంటీర్లపై ప్రయోగాలు నిర్వహిస్తారు.
కొవాగ్జిన్ తయారీ సంస్థ భారత్ బయోటెక్... ముక్కు ద్వారా వేసే కొవిడ్ వ్యాక్సిన్‌ను అభివృద్ధి చేసి, దానిపై ప్రయోగాలు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఈ టీకాను, కొవాగ్జిన్‌ను కలిపి వాడే అంశంపై అధ్యయనానికి భారత్ బయోటెక్‌కు అనుమతినివ్వాలని కూడా నిపుణుల కమిటీ సూచించింది.
ఇదీ చదవండి : పెద్దలకు మాత్రమే.. అస్సలు మిస్ కావద్దు