Cds responsibilities: తమిళనాడులో బుధవారం జరిగిన హెలికాప్టర్ ప్రమాదంలో త్రిదళాధిపతి (సీడీఎస్) జనరల్ బిపిన్ రావత్ (63), ఆయన సతీమణి మధులిక సహా మొత్తం 14 మంది మరణించారు. భారత సైన్యానికి బిపిన్ రావత్ దాదాపు 43 ఏళ్ల పాటు సేవలు అందించారు. ఎన్నో సంస్కరణలు తీసుకురావడంలో ముఖ్య పాత్ర పోషించారు. ఇంతకీ సీడీఎస్‌గా ఆయన నిర్వర్తించిన బాధ్యతలేంటంటే..
- త్రివిధ దళాలకు సంబంధించి ప్రభుత్వానికి ఏకైక (సింగిల్ పాయింట్) సలహాదారుగా సేవలు
- దేశ వ్యూహాత్మక వనరులు, అణ్వాయుధాలను మెరుగ్గా నిర్వహించడం
- వివిధ విభాగాల మధ్య సమన్వయం, వ్యూహాలు, కొనుగోళ్లు, నిర్వహణ ప్రక్రియలో సమస్యల పరిష్కారం ద్వారా త్రివిధ దళాల మధ్య సమష్ఠితత్వం తీసుకురావడం
- దీర్ఘకాలిక సైనిక ప్రణాళిక, సేకరణ విధానాలను క్రమబద్ధం చేయడం
- రక్షణ మంత్రిత్వశాఖతో సైనిక దళాల ప్రధాన కార్యాలయాలను ఏకీకృతం చేయడం, పౌర-మిలిటరీ మధ్య అంతరాన్ని తగ్గించడం
ఈ పోస్ట్ ఏర్పాటు ఎలా?
Cds post in india: 1999లో కార్గిల్ యుద్ధం అనంతరం ఏర్పాటైన మంత్రివర్గ ఉపసంఘం త్రిదళాధిపతి (సీడీఎస్) పోస్ట్ ఏర్పాటు అవసరాన్ని కీలకంగా సూచించింది.
ప్రపంచవ్యాప్తంగా అమెరికా, యూకే, ఫ్రాన్స్, జర్మనీ సహా 70కి పైగా దేశాలు మిలిటరీ వ్యూహాలు, నిర్వహణకు త్రిదళాధిపతి తరహా పోస్ట్‌ని కలిగి ఉన్నాయి.
ఇదీ చూడండి: సీడీఎస్ ప్రయాణించిన హెలికాప్టర్ భద్రతపై అనుమానాలు!
రక్షణ మంత్రిత్వశాఖలో..
Rawat in dept of military affairs: రక్షణ మంత్రిత్వశాఖలో మిలిటరీ వ్యవహారాలు చూసేందుకు డిఫెన్స్ డిపార్ట్‌మెంట్‌తో పాటు కొత్తగా డిపార్ట్‌మెంట్ ఆఫ్ మిలిటరీ అఫైర్స్ (డీఎంఏ) విభాగాన్ని ఏర్పాటు చేసి కీలక బాధ్యతలు అప్పగించారు. త్రిదళాధిపతి(సీడీఎస్) ఎక్స్-అఫీషియో కార్యదర్శిగా దీనికి నేతృత్వం వహిస్తారు. ఇప్పటివరకు జనరల్ బిపిన్ రావత్ ఈ పదవిలో కీలక బాధ్యతలు నిర్వహించారు.
Cds duties: విధులివీ...
- ప్రమోషన్లు, సీనియర్ అధికారులకు పోస్టింగులు
- మూడు దళాలకు యుద్ధం కోసం నిల్వ చేసే ఆయుధ సామగ్రి బాధ్యతలు
- మందుగుండు సామగ్రి, పేలుడు పదార్థాలు, గాలిలో ప్రయోగించే ఆయుధాల సేకరణ
- కొత్త నేవీ బేస్‌ల ఏర్పాటు వంటి కీలక మౌలిక ప్రాజెక్టులు
- యుద్ధనౌకలు, యుద్ధ విమానాలు, సైనిక సిబ్బందిని విదేశాల్లో ఏర్పాటు చేయడం
- ఆర్మీ పరిమాణం, ఆకృతి, సంవిధానం(కాంపోజిషన్)
- పొరుగు దేశాలకు ఆయుధాలు, మందుగుండు సామగ్రి సరఫరా డిఫెన్స్ డిపార్ట్‌మెంట్ వద్ద మిగిలిన విధులు
- అన్ని వస్తు సేవల సేకరణ (క్యాపిటల్ ప్రొక్యూర్‌మెంట్స్)
- రక్షణ విధానంపై ప్రభావం చూపే అన్ని అంశాలు
- సెక్రటేరియట్ ఆఫ్ డిఫెన్స్ అక్విజిషన్ కౌన్సిల్
ఇవీ చదవండి: