ETV Bharat / bharat

'వచ్చే ఏప్రిల్​లో వస్తానని చెప్పి.. తిరిగి రాని లోకాలకు' - general bipin rawat house

Bipin Rawat Home: భారత త్రిదళాధిపతి జనరల్​ బిపిన్​ రావత్ మృతి పట్ల ఆయన మామయ్య భరత్ సింగ్​ రావత్​(70) దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. రావత్​ 2018లోనే పుట్టిన గ్రామానికి వచ్చాడని గుర్తుచేసుకున్నారు. రిటైర్​మెంట్ కాగానే ఊర్లో ఇళ్లు నిర్మిస్తానని చెప్పినట్లు వెల్లడించారు.

Bipin Rawat helicopter crash
బిపిన్​ రావత్
author img

By

Published : Dec 9, 2021, 6:24 AM IST

General Bipin Rawat House: తమిళనాడు కూనూర్​లో జరిగిన హెలికాప్టర్​ ప్రమాదంలో త్రిదళాధిపతి జనరల్​ బిపిన్​ రావత్​ మరణించారు. ఈ వార్త విన్న రావత్ మామయ్య భరత్ సింగ్​ రావత్​(70) దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. రావత్​ 2018లోనే స్వగ్రామానికి వచ్చారని గుర్తుచేసుకుని కన్నీటి పర్యంతమయ్యారు. రిటైర్​మెంట్ కాగానే ఊర్లో ఇళ్లు నిర్మిస్తానని చెప్పినట్లు వెల్లడించారు.

పౌడీ గడ్వాల్ జిల్లాలోని సైనా గ్రామంలో ప్రస్తుతం భరత్​ సింగ్ కుటుంబం మాత్రమే నివసిస్తోంది. చుట్టుపక్కల గ్రామాల నుంచి వచ్చిన ప్రజలు రావత్​ మృతి పట్ల సంతాపం తెలుపుతున్నారని భరత్ సింగ్ చెప్పారు. రావత్​ 2018లో ఊరికి వచ్చినప్పుడు కులదేవతకు పూజలు చేసినట్లు తెలిపారు. పుట్టిన ఊరిపట్ల రావత్​ ఎంతో అనుబంధాన్ని కలిగి ఉండేవారని వెల్లడించారు. రిటైర్ అయ్యాక ఊరి కోసం ఏదైనా చేస్తానని చెప్పినట్లు పేర్కొన్నారు. వచ్చే ఏడాది ఏప్రిల్​లో గ్రామానికి వస్తానని చెప్పినట్లు వెల్లడించారు. తన అల్లుడి కోరిక తీరలేదని కన్నీటి పర్యంతమయ్యారు భరత్​ సింగ్. ​

దెహ్రాదూన్​లో ఇళ్లు నిర్మాణం..

పుట్టినగడ్డపై ఎంతో మమకారం చూపే బిపిన్ రావత్ తమ రాష్ట్ర రాజధాని దెహ్రాదూన్​లో స్థిర నివాసం ఏర్పరుచుకోవాలని కలలు కన్నారు. ఈ క్రమంలో నగరంలో సిల్వర్ హైట్స్​ కాలనీలో తన ఇంటిని నిర్మిస్తున్నారు. ఇంటి నిర్మాణానికి గత వారమే భూమిపూజ కార్యక్రమం పూర్తయింది. ఈ కార్యక్రమానికి రావత్​ భార్య మధులిక వచ్చినట్లు స్థానికులు తెలిపారు. తమకు మిఠాయిలు కూడా పంచినట్లు చెప్పారు. ప్రస్తుతం నిర్మాణ పనులు జరుగుతున్నాయని, బుధవారం రావత్​ మరణ వార్త తెలియగానే భవన నిర్మాణ కూలీలు, స్థానికులు షాక్​కు గురయినట్లు తెలిపారు. భవన నిర్మాణ పనులు ఆగిపోయాయని చెప్పారు.

తమిళనాడులోని కోయంబత్తూర్​-కూనూర్​ మధ్యలో హెలికాప్టర్​ ప్రమాదానికి గురై భారత త్రిదళాధిపతి(సీడీఎస్​) జనరల్​ బిపిన్​ రావత్ దుర్మరణం చెందారు. వెల్లింగ్టన్​ సైనిక కళాశాలలో జరిగే ఓ కార్యక్రమంలో పాల్గొనేందుకు వెళ్తున్న సమయంలో ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో మొత్తం 14 మందికిగానూ 13 మంది చనిపోయినట్లు వాయుసేన ప్రకటించింది.

ఇదీ చదవండి:ఆరేళ్ల క్రితం మృత్యువును జయించి.. అదే హెలికాప్టర్​ ప్రమాదంలో..

చాపర్ క్రాష్​లో​ సీడీఎస్​ రావత్​ దుర్మరణం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.