Sonia Gandhi in Lok Sabha: సీబీఎస్ఈ పదో తరగతి ఇంగ్లీష్ పరీక్ష ప్రశ్నాపత్రంపై తలెత్తిన వివాదాన్ని లోక్సభలో ప్రస్తావించారు కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ. ప్రశ్నాపత్రంలోని ఓ వ్యాసం అభ్యంతరకర రీతిలో ఉందని, మోదీ ప్రభుత్వం క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు.
ప్రశ్నను వెంటనే ఉపసంహరించుకోవాలని, జరిగిన తప్పుపై సమీక్ష నిర్వహించి సంబంధిత అధికారులపై చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు సోనియా.
CBSE paper issues: ఓ కాంప్రహెన్షన్ ప్యాసేజీలోని వ్యాఖ్యలు.. మహిళా సమానత్వాన్ని దెబ్బతీసేలా ఉన్నాయంటూ విమర్శలు ఎదురవుతున్నాయి. శనివారం నిర్వహించిన ఈ పరీక్ష ప్రశ్నాపత్రంలో 'మహిళా విమోచనం వల్ల పిల్లలపై తల్లిదండ్రుల అదుపాజ్ఞలు దెబ్బతింటున్నాయి', 'భర్త అడుగుజాడల్లో నడవడం ద్వారానే ఒక తల్లి తన పిల్లల నుంచి విధేయత వంటివాటిని పొందగలుగుతుంది' వంటి అంశాలున్నాయి.
'ఇది ఆర్ఎస్ఎస్-భాజపా కుట్ర..'
సీబీఎస్ఈ వ్యవహారంపై మండిపడ్డారు కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీ. ఇది ఆర్ఎస్ఎస్- భాజపా కుట్ర అని విమర్శించారు.
"ఇప్పటివరకు జరిగిన సీబీఎస్ఈ పరీక్షల ప్రశ్నాపత్రాలు చాలా కఠినంగా వచ్చాయి. ఇక ఇంగ్లీష్ పేపర్లో అడిగిన ప్రశ్న అత్యంత దారుణం. యువత భవిష్యత్తు, మనోబలాన్ని దెబ్బతీసేందుకు ఆర్ఎస్ఎస్- భాజపా పన్నిన కుట్ర ఇది. పిల్లల్లారా.. మీ కష్టం ఎప్పటికీ వృథా కాదు. మీరు కష్టపడండి."
--- రాహుల్ గాంధీ, కాంగ్రెస్ సీనియర్ నేత.
సీబీఎస్ఈ చర్యలు..
ఇంగ్లీష్ ప్రశ్నాపత్రంపై వివాదం చెలరేగిన నేపథ్యంలో సీబీఎస్ఈ చర్యలు చేపట్టింది. 10వ తరగతి ఇంగ్లీష్ పరీక్ష నుంచి కాంప్రహెన్షన్ ప్యాసేజీలోని ప్రశ్నలను తొలగించింది. విద్యార్థులకు పూర్తి మార్కులు ఇస్తున్నట్టు ప్రకటించింది.
ఇదీ చూడండి:-