ETV Bharat / bharat

CBSE English Paper Controversy: వివాదాస్పద ప్రశ్న తొలగించిన సీబీఎస్‌ఈ - cbse class 10 english controversy

CBSE English Paper Controversy: పదో తరగతి ఇంగ్లిష్‌ ప్రశ్నాపత్రంలో వివాదాస్పద ప్రశ్నను తొలగిస్తున్నట్లు సీబీఎస్‌ఈ ప్రకటించింది. ఈ ప్రశ్నకు సంబంధించి విద్యార్థులకు పూర్తి మార్కులు ఇస్తామని స్పష్టంచేసింది.

cbse drops controversial passage
సీబీఎస్‌ఈ
author img

By

Published : Dec 14, 2021, 7:25 AM IST

CBSE English Paper Controversy: పదో తరగతి ఇంగ్లిష్‌ ప్రశ్నపత్రంలో విమర్శలు వెల్లువెత్తిన వివాదాస్పద ప్రశ్నను తొలగిస్తున్నట్లు సెంట్రల్‌ బోర్డ్‌ ఆఫ్‌ సెకండరీ ఎడ్యుకేషన్‌ (సీబీఎస్‌ఈ) సోమవారం ప్రకటించింది. ఈ ప్రశ్నకు సంబంధించి విద్యార్థులకు పూర్తి మార్కులు ఇస్తామని స్పష్టంచేసింది.

CBSE Class 10 English Controversy:

శనివారం నిర్వహించిన ఇంగ్లిష్‌ పరీక్ష ప్రశ్నపత్రంలోని ఓ ప్యాసేజ్‌లో "మహిళా విమోచనం వల్ల పిల్లలపై తల్లిదండ్రుల అదుపాజ్ఞలు దెబ్బతింటున్నాయి", "భర్త అడుగుజాడల్లో నడవడం ద్వారానే ఒక తల్లి తన పిల్లల నుంచి విధేయత వంటివాటిని పొందగలుగుతుంది" వంటి అంశాలున్నాయి. ఈ ప్రశ్న సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ కాగా.. పెద్దఎత్తున విమర్శలొచ్చాయి. "మహిళలను సీబీఎస్‌ఈ అవమానపరిచింది" అంటూ పలువురు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. దీంతో సీబీఎస్‌ఈ ఈ అంశాన్ని విషయ నిపుణులకు నివేదించి వారి అభిప్రాయాన్ని కోరింది. అనంతరం వారి సూచన మేరకు ప్రశ్నను ఉపసంహరిస్తున్నట్లు సోమవారం తెలిపింది. అదే సమయంలో ప్రశ్నపత్రం రూపకల్పన ప్రక్రియను సమీక్షించి, బలోపేతం చేసేందుకు కమిటీని ఏర్పాటుచేయాలని నిర్ణయించింది. మరోవైపు, ఈ విషయాన్ని సోమవారం లోక్‌సభలో శూన్యగంటలో ప్రస్తావించిన కాంగ్రెస్‌ అధ్యక్షురాలు సోనియాగాంధీ ప్రభుత్వం తక్షణం క్షమాపణలు చెప్పాలని డిమాండ్‌ చేశారు.

ఇదీ చదవండి:

'ప్రధాని ట్విటర్‌ ఖాతాకే రక్షణ లేకపోతే ఎలా?'

'ప్రజల ప్రాణాలంటే లెక్కలేదా? ఆ చట్టం రద్దు చేయాల్సిందే!'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.