10,12 తరగతుల ఫస్ట్ టర్మ్ బోర్డు పరీక్షల షెడ్యూల్‌ను(Cbse Date Sheet 2021) విడుదల చేసింది సెంట్రోల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్(సీబీఎస్‌ఈ)(cbse news today). 10వ తరగతి పరీక్షలు నవంబర్ 30 నుంచి ప్రారంభం కానుండగా... 12 వ తరగతి పరీక్షలు డిసెంబర్ 1 నుంచి జరగనున్నాయని తెలిపింది.
ఈ తాజా టైం టేబుల్.. మేజర్ సబ్జెక్టులకు మాత్రమేనని సీబీఎస్ఈ ఎగ్జామ్ కంట్రోలర్ సన్యమ్ భరద్వాజ్ తెలిపారు. మైనర్ సబ్జెక్టులకు సంబంధించిన టైం టైబుల్‌ను పాఠశాలలకు ప్రత్యేకంగా పంపిస్తామని చెప్పారు. నవంబర్ 16న పదో తరగతి, నవంబర్ 17న 12వ తరగతి మైనర్ సబ్జెక్టుల పరీక్షలు జరుగుతాయని వెల్లడించారు.
కరోనా కారణంగా గతంలో.. 2021-22 విద్యాసంవత్సరానికి మార్పులు చేసింది సీబీఎస్ఈ. విద్యాసంవత్సరాన్ని రెండుగా విభజించి.. రెండు టర్మ్-ఎండ్ పరీక్షలు నిర్వహించాలని నిర్ణయించింది. అందుకు తగ్గట్టుగానే సిలబస్‌లోనూ మార్పులు చేసింది.
10, 12వ తరగతి ఫస్ట్ టర్మ్ పరీక్షలు ఆఫ్‌లైన్‌లోనే నిర్వహిస్తామని సీబీఎస్ఈ గత వారం స్పష్టం చేసింది. 90 నిమిషాల నిడివి గల ఈ పరీక్షలు.. ఆబ్జెక్టివ్ విధానంలో ఉంటాయని తెలిపింది. ఉదయం 11:30కి పరీక్షలు ప్రారంభమవుతాయని చెప్పింది.
ఇదీ చూడండి: భారత సైన్యం చేతికి 'త్రిశూలం'.. చైనాకు ఇక 'షాక్'!