చిన్నారులపై లైంగిక వేధింపులకు పాల్పడుతున్న వారే లక్ష్యంగా సీబీఐ భారీ ఆపరేషన్ చేపట్టింది. 14 రాష్ట్రాల్లోని 76 ప్రాంతాల్లో ఏకకాలంలో సోదాలు జరిపినట్లు అధికారులు తెలిపారు.
చిన్నారుల్ని లైంగికంగా వేధించిన ఆరోపణలపై ఈనెల 14న 83 మంది నిందితులపై 23 కేసులు నమోదు చేసింది సీబీఐ. వీరిచ్చిన సమాచారం ఆధారంగా ఈ దాడులు చేస్తున్నట్లు తెలిపింది.
ఆంధ్రప్రదేశ్ సహా.. దిల్లీ, ఉత్తర్ప్రదేశ్, పంజాబ్, బిహార్, ఒడిశా, తమిళనాడు, రాజస్థాన్, మహారాష్ట్ర, గుజరాత్, హరియాణా, ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్, హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రాల్లో సీబీఐ దాడులు నిర్వహించింది.
ఇవీ చదవండి: