ETV Bharat / bharat

ఆ రాష్ట్రంలోని 13 జిల్లాల్లో సీబీఐ దాడులు - గోమతీ ప్రాజెక్ట్ సీబీఐ

గోమతి రివర్​ ఫ్రంట్​ ప్రాజెక్టు అవకతవకలపై ఉత్తర్​ప్రదేశ్​లోని 13 జిల్లాల్లో సోదాలు నిర్వహించింది కేంద్ర దర్యాప్తు సంస్థ (CBI). ఈ కేసులో 189 మంది అధికారులు నిందితులుగా ఉన్నారని సీబీఐ వెల్లడించింది.

gomti river front project, గోమతి ప్రాజెక్టు సీబీఐ
ఉత్తర్​ప్రదేశ్​లో సీబీఐ సోదాలు
author img

By

Published : Jul 5, 2021, 12:48 PM IST

ఉత్తర్​ప్రదేశ్​ లఖ్​నవూలోని గోమతి రివర్​ ఫ్రంట్​ ప్రాజెక్టు అవకతవకలపై కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ) కేసు నమోదు చేసింది. ఇందుకు సంబంధించి రాష్ట్రంలోని 13 జిల్లాల్లోని 42 ప్రాంతాల్లో సోదాలు నిర్వహించింది. వీటితో పాటు రాజస్థాన్​లోని అల్వార్​, బంగాల్​ రాజధాని కోల్​కతాలో కూడా సోదాలు చేపట్టింది.

189 మంది నిందితులు..

ఈ ఆపరేషన్​ను​ మరింత విస్తృతంగా చేపట్టే అవకాశం ఉందని సీబీఐ అధికారులు వెల్లడించారు. ఈ కేసులో 189 మంది ఉత్తర్​ప్రదేశ్​ ప్రభుత్వ అధికారులు నిందితులుగా ఉన్నారని తెలిపారు. గోమతి ప్రాజెక్టుకు సంబంధించి సీబీఐ ఎఫ్​ఐఆర్​ నమోదు చేయడం ఇది రెండోసారి.

సమాజ్​వాదీ పార్టీ హయాంలో ఈ ప్రాజెక్టు ప్రారంభమైంది.

ఇదీ చదవండి : 'కార్పొరేట్ల చెప్పుచేతల్లో ప్రభుత్వం'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.