ETV Bharat / bharat

'ప్రశ్నకు నోటు కేసు విచారణలో వ్యక్తిగత విషయాలెందుకు?' భేటీ నుంచి మహువా, విపక్ష ఎంపీల వాకౌట్ - ప్రశ్నకు ఓటు కేసు

Cash For Query Case : టీఎంసీ ఎంపీ మహువా మొయిత్రా సొమ్ములు స్వీకరించి లోక్​సభలో ప్రశ్నలు అడిగారనే ఆరోపణల కేసు విచారణను బహిష్కరించారు విపక్ష ఎంపీలు. కొందరు కమిటీ సభ్యులు వ్యవహరించిన తీరును వ్యతిరేకిస్తూ.. వాకౌట్ చేశామని ఎంపీలు తెలిపారు.

Cash For Query Case
Cash For Query Case
author img

By PTI

Published : Nov 2, 2023, 5:18 PM IST

Updated : Nov 2, 2023, 5:53 PM IST

Cash For Query Case : తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ మహువా మొయిత్రా లోక్‌సభలో ప్రశ్నలు అడిగేందుకు డబ్బులు తీసుకున్నారంటూ వచ్చిన ఆరోపణలపై ఎథిక్స్ కమిటీ విచారణను బహిష్కరించారు విపక్ష ఎంపీలు. విచారణ జరుగుతున్న సమయంలోనే మహువా మొయిత్రా, ఇతర విపక్ష ఎంపీలు మధ్యలోనే వెళ్లిపోయారు. కొందరు కమిటీ సభ్యులు వ్యవహరించిన తీరును వ్యతిరేకిస్తూ.. వాకౌట్ చేశామని ఎంపీలు తెలిపారు. మహువాకు కమిటీ వ్యక్తిగత, అనైతిక ప్రశ్నలు వేసిందని విపక్ష ఎంపీలు ఆరోపించారు. ఆమెకు కాంగ్రెస్ ఎంపీ ఉత్తమ్​కుమార్ రెడ్డి, బీఎస్​పీ ఎంపీ, దానిశ్ అలీ మద్దతు తెలిపారు.

'నీచమైన ప్రశ్నలు అడుగుతున్నారు'
అంతకుముందు వాకౌట్​ చేస్తూ బయటకు వెళ్లిన ఎంపీ మహువా మొయిత్రా.. తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. "అసలు అదేం మీటింగ్‌..? వారు నీచమైన ప్రశ్నలు వేశారు. వారు దేని గురించి అయినా ప్రశ్నిస్తున్నారు. నా కళ్లల్లో నీళ్లు వచ్చాయి. నా కళ్లలో నీళ్లు మీకు కనిపిస్తున్నాయా?" అని బయటకు వెళ్తూ మహువా తీవ్రంగా వ్యాఖ్యానించారు.

  • #WATCH | Delhi: Opposition parties MPs including TMC MP Mahua Moitra and BSP MP Danish Ali, walked out from the Parliament Ethics Committee meeting.

    TMC MP Mahua Moitra appeared before the Parliament Ethics Committee in connection with the 'cash for query' charge against her. pic.twitter.com/EkwYLPnD1O

    — ANI (@ANI) November 2, 2023 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

పక్కదారి పట్టించేందుకే బహిష్కరణ : ఛైర్మన్​
మరోవైపు దీనిపై స్పందించిన ఎథిక్స్ కమిటీ ఛైర్మన్​ వినోద్ సోనాకర్​.. ఆరోపణలను పక్కదారి పట్టించేందుకే విచారణను బహిష్కరించారని ఎదురుదాడికి దిగారు. విపక్ష ఎంపీలు అనైతికంగా ప్రవర్తించారని అభిప్రాయపడ్డారు. విపక్ష సభ్యులు.. తనపై, కమిటీపై అనుచిత వ్యాఖ్యలు చేశారని తెలిపారు. క్రాస్‌ ఎగ్జామిన్‌ చేస్తున్న సమయంలో ఆమె ఏ మాత్రం సహకరించలేదన్నారు. 'ఈ విచారణకు మహువా సహకారం అందించలేదు. విపక్ష సభ్యులు కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. మరిన్ని ప్రశ్నలకు సమాధానం ఇవ్వకుండా దాటవేసేందుకే వారు ఆకస్మికంగా మీటింగ్‌ నుంచి వాకౌట్ చేశారు' అని వినోద్‌ ఆరోపించారు. హీరానందనీ అఫిడవిట్​పై ప్రశ్నలు అడిగితే.. మొయిత్రా ఆగ్రహాన్ని ప్రదర్శించారని కమిటీ సభ్యుడు అపరాజిత సారంగి తెలిపారు.

  • #WATCH | Chairman of Parliament Ethics Committee, Vinod Sonkar says, "Instead of giving answers, she (Mahua Moitra) got angry and used unparliamentary language for the Chairperson, and Committee members. Danish Ali, Girdhari Yadav and other opposition MPs tried to accuse the… https://t.co/rIAz38FxoU pic.twitter.com/aA4I4E26AF

ఏ శక్తీ ఆపలేదు : దూబే
టీఎంసీ ఎంపీ మహువా మొయిత్రా.. విచారణను తప్పుదారి పట్టించేందుకు ప్రయత్నించారని ఆరోపించారు బీజేపీ ఎంపీ నిషికాంత్ దూబే. విపక్ష ఎంపీలు విచారణ బహిష్కరించిన అనంతరం మాట్లాడిన దూబే.. ప్యానెల్​కు ఓబీసీ సభ్యుడు నేతృత్వం వహించడం వల్లే ప్రతిపక్షాలు ఆందోళనకు గురవుతున్నాయన్నారు. ఆమెకు వ్యతిరేకంగా అన్ని ఆధారాలను అందించానని.. ఏ శక్తి కూడా ఆమెను కాపాడలేదని దూబే చెప్పారు.

  • #WATCH | Delhi: On allegations of 'cash for query' against TMC MP Mahua Moitra, BJP MP Nishikant Dubey says, "...No power in the world can save Mahua Moitra. As a parliamentarian, we are sad that we are part of a Parliament where people take money to ask questions..." pic.twitter.com/445Zucgz20

లోక్‌సభలో అదానీ గ్రూప్‌నకు వ్యతిరేకంగా ప్రశ్నలు అడిగేందుకు వ్యాపారవేత్త దర్శన్‌ హీరానందాని నుంచి టీఎంసీ ఎంపీ మహువా డబ్బులు తీసుకున్నారంటూ బీజేపీ ఎంపీ నిషికాంత్‌ దూబే చేసిన ఆరోపణలపై ఎథిక్స్‌ కమిటీ విచారణ చేపట్టింది. గతనెల 26న ఈ కేసులో తొలిసారి సమావేశమైన ఎథిక్స్‌ కమిటీ.. బీజేపీ ఎంపీ దూబేతోపాటు న్యాయవాది జైఅనంత్‌ దేహద్రాయ్‌ను ప్రశ్నించింది. వారి నుంచి వాంగ్మూలాలు తీసుకుంది.

Mahua Moitra Hiranandani : 'అవును.. లాగిన్‌, పాస్​వర్డ్​ నేనే ఇచ్చా'.. నిజం ఒప్పుకున్న ఎంపీ మహువా మొయిత్రా

Mahua Moitra Shashi Tharoor Photos : టీఎంసీ మహిళా ఎంపీ- శశిథరూర్ ఫొటోలు వైరల్​.. సస్పెండ్​ చేయాలని బీజేపీ డిమాండ్​!

Last Updated : Nov 2, 2023, 5:53 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.