ETV Bharat / bharat

రామచిలుక అరుస్తుందని యజమానిపై కేసు..!

రామచిలుక అరుపులకు ఎంతో మంది మురిసిపోయి ఆస్వాదిస్తుంటారు. కానీ మహారాష్ట్రలోని పుణెకు చెందిన ఓ వృద్ధుడికి చిలుక అరుపులు చిరాకు తెప్పించాయి. దీంతో చిలుక యాజమానిపై ఆయన కేసు పెట్టారు.

Etv Bharat
Case lodged against parrot owner as the bird whistled 'too much'
author img

By

Published : Aug 7, 2022, 10:27 PM IST

Police Case On Parrot Owner: సాధారణంగా రామ చిలుక అంటే ఎవరైనా ఇష్టపడతారు. వీలుంటే దానిని ఓసారి చేతిలోకి తీసుకుని ముద్దాడాలని అనుకుంటారు. కొందరు వాటిని ఇళ్లల్లో పెంచుకుంటూ ఎంతో గారాబంగా చూసుకుంటారు. చిలుక అరుపులు, చేష్టలకు మురిసిపోతుంటారు. కానీ, ఓ వృద్ధుడికి అదే నచ్చలేదు. రామచిలుక అరుపులు.. ఆయనకు చికాకు తప్పించాయి. పక్కింట్లో ఉన్న రామచిలుక గోల తాను తట్టుకోలేక పోతున్నానంటూ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ సంఘటన మహారాష్ట్రలోని పుణెలో జరిగింది.

అసలేం జరిగిందంటే?.. పుణె నగరంలోని శివాజీ నగర్ ప్రాంతంలో సురేశ్​ శిందే అనే 72 ఏళ్ల వ్యక్తి నివాసం ఉంటున్నాడు. ఆయన పక్కింట్లో ఉంటున్న అక్బర్​ అంజద్​ ఖాన్​.. ఓ రామచిలుకను పెంచుకుంటున్నాడు. అయితే చిలుక ఎప్పుడూ అరుస్తూనే ఉందని, అది తనకు చిరాకు తెప్పిస్తున్నట్లు సురేశ్​ శిందే.. ఖడ్కే పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. నిబంధనల ప్రకారం దర్యాప్తు చేపడతామని తెలిపారు.

ఇవీ చదవండి: యువకుడ్ని పొట్టనపెట్టుకున్న మొసలి.. రెండు గంటల పాటు చెలగాటం ఆడి..

చుట్టూ వరద నీరు.. భుజాలపై మృతదేహం.. అలానే అంతిమ యాత్ర!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.