రాజకీయంగా అనిశ్చితిని ఎదుర్కొంటున్న ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రి భూపేశ్ బఘేల్ తండ్రి కారణంగా మరింత ఒత్తిడిని గురవుతున్నారు. సీఎంగా బఘేల్‌ను తప్పించాలనే డిమాండ్లు కాంగ్రెస్‌లో వినిపిస్తున్న వేళ ముఖ్యమంత్రి తండ్రిపై రాయ్‌పూర్‌లో ఎఫ్‌ఐఆర్ నమోదైంది. భూపేష్ బఘేల్ తండ్రి నందకుమార్ బఘేల్.. బ్రాహ్మిణ సామాజిక వర్గానికి వ్యతిరేకంగా ఉత్తర్ ప్రదేశ్‌లో వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఆ సామాజిక వర్గానికి చెందిన నేతల ఫిర్యాదుతో రాయ్‌పూర్‌లోని దీన్ దయాల్ పోలీస్ స్టేషన్‌లో నందకుమార్‌పై కేసు నమోదైంది.
ఈ అంశంపై స్పందించిన (bhupesh baghel chhattisgarh cm) ముఖ్యమంత్రి భూపేశ్.. చట్టానికి ఎవరూ అతీతులుకారని వ్యాఖ్యానించారు. సీఎంగా మత సామరస్యం, శాంతిభద్రతలు కాపాడటం తన కర్తవ్యమని ఆయన చెప్పారు. తన తండ్రి తప్పుందని తేలితే ఆయనపై చట్టపరమైన చర్యలు తీసుకుంటానని ఛత్తీస్‌గఢ్ సీఎం స్పష్టంచేశారు.
ముఖ్యమంత్రిగా సమాజంలో వివిధ వర్గాల మధ్య సామరస్యత, సోదరభావం పెంపొందించడం నా కర్తవ్యం. అది ఖండించాల్సి విషయం. ఈ అంశంపై చట్ట ప్రకారం దర్యాప్తు జరుగుతుంది. సామాజికవర్గాలకు వ్యతిరేకంగా అలాంటి వ్యాఖ్యలు చేయడం నిజంగా బాధాకరం. ఈ అంశంపై (తండ్రి వ్యాఖ్యలపై) చట్ట ప్రకారం దర్యాప్తు జరుగుతుంది.
-భూపేశ్ బఘేల్, ఛత్తీస్‌గడ్ ముఖ్యమంత్రి
ఇటీవల ఉత్తర్‌ప్రదేశ్‌లోని కార్యక్రమానికి హాజరైన నంద్‌కుమార్ బఘేల్.. బ్రాహ్మీణ సామాజిక వర్గంపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఆ వర్గం వారు విదేశీయులని.. వారిని గ్రామాల్లోకి రానివ్వకూడదంటూ పేర్కొన్నారు.
ఇదీ చూడండి : సీఎం అయినా.. అక్కడ పైపు నీళ్లే తాగుతారు!