ఉత్తరాఖండ్‌ను(Uttarakhand floods) ఎడతెరిపి లేని వర్షాలు, వరదలు వణికిస్తున్నాయి. రాష్ట్రంలోని చాలా నదులు (Uttarakhand rain news).. ప్రమాదకర స్థాయిని మించి ప్రవహిస్తున్నాయి. రామ్‌నగర్‌లో మాత్రం పరిస్థితులు తీవ్రంగా ఉన్నాయి. కోసీ నది అంతకంతకూ ఉగ్రరూపం దాల్చుతోంది. నది నుంచి రిసార్టుల్లోకి భారీగా నీరు చేరింది. లెమన్ ట్రీ రిసార్ట్ బయట పార్క్ చేసిన కార్లన్నీ నీటమునిగిపోయాయి. జిమ్ కార్బెట్ పార్క్ (Jim carbett national park) సందర్శనకు వచ్చిన పర్యటకులు కొద్దిరోజులు లోపలే బిక్కుబిక్కుమంటూ గడిపారు. చాలా సేపు శ్రమించిన అనంతరం.. మంగళవారం సుమారు 200 మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు అధికారులు.
మోహాన్, ఢికులా ప్రాంతాల్లోనూ రిసార్ట్లు(Uttarakhand floods) జలదిగ్బంధం అయ్యాయి. నీటిలో సిలిండర్లు, గ్యాస్ పొయ్యిలు, ఇతర సామగ్రి కొట్టుకుపోయాయి.
రాష్ట్రవ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాల(Uttarakhand rain news) ధాటికి ఇప్పటివరకు సుమారు 25 మంది చనిపోయారని తెలిపారు నైనితాల్ డీజీపీ అశోక్ కుమార్.
తెలంగాణ వారు కూడా..
లెమన్ ట్రీ రిసార్ట్‌లో చిక్కుకున్న వారిలో తెలంగాణ మల్కాజ్‌గిరికి చెందిన ఓ యువతి ఉంది. సాఫ్ట్వేర్ ఉద్యోగి అయిన సుష్మ తన ఐదుగురు మిత్రులతో.. దసరా సెలవుల్లో ఉత్తరాఖండ్‌కు(Uttarakhand news) వెళ్లింది. వర్షాల కారణంగా.. రిసార్ట్‌లోనే నాలుగు రోజులు ఉండాల్సి వచ్చింది. రెండో అంతస్తు వరకు నీరు చేరగా.. తాము మూడో అంతస్తులో ఉన్నట్లు తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చింది సుష్మ. అనంతరం.. వారిని అధికారులు రక్షించారు.
ఇదీ చూడండి: బస్సును కొట్టేసి పరారైన దొంగలు.. కానీ...