ETV Bharat / bharat

ఫంక్షన్​కు గెస్ట్​లను పిలిచి వస్తుండగా ప్రమాదం.. ఒకే కుటుంబంలోని నలుగురు మహిళలు మృతి

Car Fell Into Canal In Karnataka : కాలువలోకి కారు దూసుకెళ్లడం వల్ల ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మహిళలు మృతి చెందారు. మృతుల్లో ఓ బాలిక కూడా ఉన్నట్లు పోలీసులు తెలిపారు. కర్ణాటకలో జరిగిందీ ఘటన.

Car Fell Into Canal In Karnataka
Car Fell Into Canal In Karnataka
author img

By

Published : Jul 30, 2023, 9:55 AM IST

Updated : Jul 30, 2023, 10:46 AM IST

Car Fell Into Canal In Karnataka : కర్ణాటకలోని మాండ్య జిల్లాలో కాలువలోకి కారు దూసుకెళ్లడం వల్ల ఓ బాలిక సహా నలుగురు మృతిచెందారు. శనివారం రాత్రి జరిగిన ఈ ప్రమాదంపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. మృతదేహాలను వెలికి తీసి పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.

ఇదీ జరిగింది.. మలవల్లి మండలంలోని దోరనహళ్లి గ్రామానికి చెందిన మహదేవమ్మ, రేఖ, సంజన, మమతా.. తమ ఇంట్లో జరిగబోయే కార్యక్రమానికి అథితులను అహ్వానించి.. కారులో శనివారం గామనహళ్లి నుంచి బన్నూరు తిరిగి వస్తున్నారు. శ్రీరంగపట్నం మండలంలోని గామనహళ్లి గ్రామ సమీపంలోకి రాగానే రాత్రి సమయంలో అదుపుతప్పిన కారు కాలువలో పడిపోయింది. దీంతో అందులో ఉన్న బాలిక సహా ముగ్గురు మహిళలు నీట మునిగి మృతి చెందారు. డ్రైవర్​ మనోజ్​ తీవ్రగాయాలతో ఆస్పత్రిలో చేరాడు. ఈ ప్రమాదంపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. మృతదేహాలను వెలికి తీసి పోస్టు మార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఇటీవల ఈ కెనాల్​లోనే కారు పడి ఓ వ్యక్తి మృతి చెందాడు.

Car Fell Into Canal In Karnataka
కాలువలో పడిపోయిన కారు

రోడ్డు ప్రమాదంలో పోలీసు ఇన్​స్పెక్టర్​ మృతి..
దిల్లీలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో పోలీసు ఇన్పెక్టర్​ జగ్బీర్ సింగ్​ ప్రాణాలు కోల్పోయారు. మెకానికల్‌ సమస్య వల్ల ఆగిపోయిన ఆయన కారును.. వెనుక నుంచి ఓ ట్రక్కు ఢీకొనడం వల్ల ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. దిల్లీ పోలీసు ఇన్స్​పెక్టర్​ జగ్బీర్​ సింగ్​ ప్రయాణిస్తున్న కారులో మెకానికల్​ సమస్య తలెత్తింది. దీంతో ఆయన కారు మాదిపుర్​ మెట్రో స్టేషన్​ సమీపంలో రోడ్డుపై ఆగిపోయింది. దీంతో జగ్బీర్​ సింగ్​ కిందకు దిగి కారును పరిశీలిస్తున్న క్రమంలో వెనుక నుంచి వచ్చిన ట్రక్కు ఢీకొట్టింది. దీంతో ఆయన అక్కడిక్కడే ప్రాణాలు కోల్పోయారు. ట్రక్కు డ్రైవర్​ అక్కడి నుంచి పరారయ్యాడు. జగ్బీర్​ సింగ్​ దిల్లీ భద్రతా విభాగంలో విధులు నిర్వర్తిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై విచారణ చేపట్టినట్లు వెల్లడించారు.

  • Delhi | A Delhi Police inspector died after his car was hit by a truck from behind on Rohtak Road, near Madipur metro station. The car had stopped due to some mechanical problem and the deceased was standing outside when his car was hit by the truck. The deceased has been… pic.twitter.com/qDE5aLHP4x

    — ANI (@ANI) July 30, 2023 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

Last Updated : Jul 30, 2023, 10:46 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.