Car accident: మహారాష్ట్రలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. పుణె- ముంబయి ఎక్స్ప్రెస్ వే వద్ద కారు ఓ కంటైనర్ను ఢీకొన్న ఘటనలో ఐదుగురు మృతి చెందారు. లోనావ్లా, శిలాతనే గ్రామంలో ఉదయం 8 గంటలకు ఈ ప్రమాదం జరిగింది.
పుణె నుంచి ముంబయికి వెళ్తుండగా.. అదుపుతప్పి డివైడర్ను ఢీకొట్టి రోడ్డు అవతలి భాగంలోకి వెళ్లింది కారు. ఎదురుగా వస్తున్న కంటైనర్ కిందికి దూసుకెళ్లింది. దీంతో కారు నుజ్జునుజ్జు అయింది. అందులో ఉన్న ఐదుగురు అక్కడికక్కడే మృతి చెందారు. వీరంతా హరియాణాకు చెందినవారిగా తెలుస్తోంది.
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోనిలో రిజిస్ట్రేషన్ ఉచితం!
ఇదీ చదవండి: కశ్మీర్లో ఎన్కౌంటర్- ఐదుగురు పాక్ ముష్కరులు హతం