ETV Bharat / bharat

గణతంత్ర కవాతులో మెరిసిన నారీ శక్తి

author img

By

Published : Jan 26, 2021, 12:02 PM IST

రిపబ్లిక్​ డే పరేడ్​లో మహిళలు సత్తా చాటారు. వేర్వేరు విభాగాలకు నేతృత్వం వహించారు.

women empowerment, republic day
రాజపథ్​లో నారీశక్తి

గణతంత్ర వేడుకల్లో నారీ శక్తి సత్తా చాటింది. రాజపథ్​లో నిర్వహించిన కవాతులో వివిధ దళాలకు మహిళలు నేతృత్వం వహించారు.

ఫ్లైట్​ లెఫ్టినెంట్ భావనా కాంత్​..

భారత్​లోని తొలి ముగ్గురు మహిళా పైలట్లలో ఒకరైన భావనా కాంత్.. రిపబ్లిక్​ డే పరేడ్​ సందర్భంగా వాయుసేన కవాతులో పాల్గొన్నారు. ఆ ఘనత సాధించిన తొలి మహిళగా నిలిచారు.

2017 నవంబరులో వాయుసేనలో చేరారు భావన. 2018 మార్చిలో తొలి ఎంఐజీ-21 బైసన్ యుద్ధవిమానాన్ని నడిపారు. ప్రస్తుతం పశ్చిమ సెక్టార్​ ఫైటర్​ బేస్​లో విధులు నిర్వహిస్తున్నారు.

women empowerment, republic day
ఫ్లైట్​ లెఫ్టినెంట్ భావనా కాంత్

కెప్టెన్​ ప్రీతి చౌదరి

140 ఎయిర్ డిఫెన్స్ రెజిమెంట్​కు చెందిన కెప్టెన్​ ప్రీతి చౌదరి, అత్యాధునిక షిల్కా ఆయుధ వ్యవస్థకు నేతృత్వం వహించారు. సైన్యంలోని ఉన్న ఏకైక కంటిన్జెంట్​ కమాండర్​.. కెప్టెన్​ ప్రీతి చౌదరి.

ఆధునిక రాడార్​, డిజిటల్​ ఫైర్​ కంట్రోల్​ కంప్యూటర్స్ వంటివి షిల్కా ఆయుధ వ్యవస్థలో భాగం.

women empowerment, republic day
కెప్టెన్​ ప్రీతి చౌదరి
women empowerment, republic day
సీనియర్ అండర్ ఆఫీసర్ సమృద్ధి హర్షల్ సంత్

ఎన్​సీసీకి సమృద్ధి

మహారాష్ట్రలోని ఎన్​సీసీ డైరెక్టరేట్​కు చెందిన సీనియర్ అండర్​ ఆఫీసర్​ సమృద్ధి హర్షల్ సంత్​ ఆధ్వర్యంలో ఎన్​సీసీ మహిళా దళం పరేడ్​ నిర్వహించింది.

ఇదీ చదవండి : బడుగు దేశాలకు అండగా భారత్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.