Cannabis Seized: త్రిపురలో అక్రమంగా తరలిస్తున్న 215 కేజీల గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. సెపాహిజాల జిల్లా బిశ్రామ్గంజ్లో ఈ ఘటన జరిగింది.

ముందస్తు సమాచారంతో బిశ్రామ్గంజ్లోని జాతీయ రహదారిపై పోలీసులు తనిఖీలు నిర్వహించారు. ఈ క్రమంలో ఓ లారీ అక్కడకు వచ్చింది. దానిని తనిఖీ చేయగా 215 కేజీల ఎండిన గంజాయిని పోలీసులు గుర్తించారు. లారీని స్వాధీనం చేసుకుని డ్రైవర్‌ను అరెస్టు చేశారు. బిహార్‌కు గంజాయిని తరలిస్తున్నట్లు చెప్పారు.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోనిలో రిజిస్ట్రేషన్ ఉచితం!
ఇదీ చదవండి: రైల్వే పరీక్షల్లో అవకతవకలు- నేడు ఆ రాష్ట్ర బంద్!