ETV Bharat / bharat

బుద్ధదేవ్ 'గళం'.. వామపక్షాలకు బలమవుతుందా? - బుద్ధదేవ్ భట్టాచార్య

బంగాల్​ ఎన్నికల నేపథ్యంలో కమ్యూనిస్ట్​ పార్టీ ఆఫ్​ ఇండియా (మార్క్సిస్ట్‌​) సీనియర్​ నేత, మాజీ ముఖ్యమంత్రి బుద్ధదేవ్ భట్టాచార్య భాజపా, తృణమూల్​పై విమర్శలు చేస్తూ ఆడియో క్లిప్​ విడుదల చేశారు. నందిగ్రామ్​, సింగూర్​ ఘటనలు సహా ప్రస్తుత రాష్ట్ర పరిస్థితులపై కీలక వ్యాఖ్యలు చేశారు. బలహీన పడుతున్న సీపీఐ(ఎం)కు ఈ ఆడియో సందేశం ఏమేరకు బలం చేకూరుస్తుందనే అంశంపై రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది.

Buddhadeb Bhattacharjee audio clip, బుద్ధదేవ్ భట్టాచార్య
బుద్ధదేవ్​ భట్టాచార్య
author img

By

Published : Apr 3, 2021, 6:56 PM IST

'నాడు కుట్ర పన్నిన వారే ఇప్పుడు ఒకరిపై ఒకరు బురద చల్లుకుంటున్నారు'.. నందిగ్రామ్​, సింగూర్​ ఘటనలపై భాజపా, తృణమూల్​ కాంగ్రెస్​లను ఉద్దేశించి బంగాల్​ మాజీ ముఖ్యమంత్రి బుద్ధదేవ్​ భట్టాచార్య ఇటీవల చేసిన వ్యాఖ్యలివి.

ప్రస్తుత రాజకీయ పరిస్థితి, రాష్ట్రంలో సమస్యలపై 77 ఏళ్ల బుద్ధదేవ్​ తొలిసారి తన గళాన్ని విప్పారు. గత ఆరేళ్లుగా సీపీఐ(ఎం) కార్యకలాపాలపై మౌనం వహించిన ఈ నేత.. తాజాగా అందించిన ఆడియో సందేశానికి రాజకీయ వర్గాల్లో విశేష ప్రాధాన్యం ఏర్పడే అవకాశం ఉందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

బుద్ధదేవ్​ ఆడియో క్లిప్

అసలు ఆడియోలో ఏముంది?

"ఒకప్పుడు బంగాల్​కు గర్వకారణంలా ఉండే స్నేహపూర్వక వాతావరణం ఇప్పుడు విషతుల్యంగా మారింది. నందిగ్రామ్​, సింగూర్​ ఘటనలకు కారకులైన వారే ఇప్పుడు ఒకరిపై ఒకరు బురదచల్లుకుంటున్నారు. ఓవైపు నిరంకుశమైన తృణమూల్​ కాంగ్రెస్​, మరోవైపు విభజన రాజకీయాలు, పెట్టుబడిదారు ఆర్థిక వ్యవస్థను ప్రోత్సహించే భాజపా ఉంది. భాజపా వెనుక ప్రమాదకరమైన సిద్ధాంతలతో నడిచే ఆర్​ఎస్​ఎస్​ ఉంది. వీటి ఉద్దేశం రాష్ట విధ్వంసం. యువత కలలు ఛిద్రమయ్యాయి. వైద్య, విద్యా వ్యవస్థలు నిర్వీర్యమయ్యాయి. రాష్ట్రంలో ఉపాధిలేక యువత వలస వెళ్తోంది. ఈ ఎన్నికలు బంగాల్​ రాజకీయాల్లో కీలక మలుపు. ఈ పరిస్థితిని అంతమొందించాలి. బంగాల్​ ప్రజలు వామపక్షాలు, కాంగ్రెస్​ కూటమికి మద్దతుగా నిలవాల్సిన సమయం ఆసన్నమైంది."

-బుద్ధదేవ్​ భట్టాచార్య, సీపీఐ(ఎం) నేత

బుద్ధదేవ్​ కీలక పాత్ర పోషిస్తారా?

మాజీ ముఖ్యమంత్రి జోతిబసు నుంచి పగ్గాలు అందుకుని రాష్ట్రాన్ని పాలించిన బుద్ధదేవ్​కు.. నందిగ్రామ్​, సింగూర్ ఘటనలతో ఎదురుదెబ్బ తగిలింది. ఇది సీపీఎం పైన కూడా తీవ్ర ప్రభావం చూపింది. దీంతో 34ఏళ్ల పాటు బంగాల్​ను నిర్విరామంగా పాలించిన వామపక్షాలు.. ప్రస్తుతం తన ఉనికిని కాపాడుకోలేని స్థితికి దిగజారాయి.

బుద్ధదేవ్.. లెఫ్ట్​ పార్టీ తరపున​ చివరిసారిగా 2019 లోక్​సభ ఎన్నికల ప్రచారం చేశారు. కోల్​కతా పరేడ్​ గ్రౌండ్​లో నిర్వహించిన సభలో పాల్గొన్నారు. అనారోగ్యం కారణంగా ఎలాంటి ప్రసంగాలు చేయకపోయినా.. ప్రచారంలో పాల్గొనడం ద్వారా పార్టీ వర్గాలను ఉత్సాహపరిచారు. కానీ ఆ ఎన్నికల్లో పార్టీకి ఇవేవీ కలిసిరాలేదు. అందుకు భిన్నంగా వామపక్షాలకు ఏడు శాతం ఓట్లు మాత్రమే లభించాయి. అయితే.. బుద్ధదేవ్​ ఇప్పటికీ గేమ్​ చేంజరే అని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. దీనికి గత ఎన్నికల ఫలితాలతో సంబంధం లేదని పేర్కొంటున్నాయి.

దీదీ వ్యాఖ్యలతో..

2007, మార్చి 14న జరిగిన నందిగ్రామ్​ ఘటనపై బంగాల్​ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఇటీవల కీలక వ్యాఖ్యలు చేశారు. ఘటన సందర్భంగా కాల్పులు జరగడానికి కారణం సువేందు, అతని తండ్రి శిశిర్​ అధికారి అని పరోక్షంగా ఆరోపించారు. ఈ వివాదస్పద వ్యాఖ్యలను ప్రామాణికంగా తీసుకుని.. నందిగ్రామ్​ ఘటనకు బుద్ధదేవ్​ ఆధ్వర్యంలోని ప్రభుత్వానికి ఎలాంటి సంబంధం లేదంటూ సీపీఐ(ఎం) ప్రచారం చేస్తోంది. ఇదివరకు బుద్ధదేవ్​ ఇచ్చిన లిఖిత పూర్వక ప్రకటనను కూడా ప్రచారంలో భాగం చేసింది. ఈ చర్యల ద్వారా మరోసారి ప్రజల నమ్మకాన్ని గెలుచుకునేందుకు ప్రయత్నిస్తోంది.

ఈ ఏడాది మార్చి 2న బ్రిగేడ్​ పరేడ్​ గ్రౌండ్​లో నిర్వహించిన ర్యాలీలో బుద్ధదేవ్​ పాల్గొంటారని పార్టీ ఆశించింది. కానీ అటువంటిది ఏమీ జరగలేదు. ఈ సభలో ఇండియన్​ సెక్యులర్​ ఫ్రంట్​ వ్యవస్థాపకుడు అబ్బాస్​ సిద్ధిఖీ హాజరయ్యారు. ఈ సమావేశంలో వామపక్ష నేతలు బుద్ధదేవ్​ పేరును ఒక్కసారి కూడా ప్రస్తావించలేదు. ఇలా.. చివరి నిమిషంలో బుద్ధదేవ్ ఆడియోను విడుదల చేయడం ఎంత వరకు కలిసొస్తుందనే ప్రశ్న ఉత్పన్నమవుతోంది. బుద్ధదేవ్​ ఆడియో క్లిప్ పార్టీకి బలం చేకురుస్తుందా? లేదా? అనే విషయంపై సందేహాలు వ్యక్తమవుతున్నాయని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

ఇవీ చదవండి :

కేరళ: ఒకరిది వృద్ధి మాట.. మరొకరిది ఉద్వేగాల బాట

ఉద్గారాల కట్టడికి కొత్త గడువు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.