బీసీసీఐ అధ్యక్షుడు సౌరభ్ గంగూలీకి (Ganguly News) కోల్‌కతా హైకోర్టు.. 10 వేల జరిమానా విధించింది. కోల్‌కతా సమీపంలో పాఠశాల నిర్మాణం కోసం గంగూలీకి (Sourav Ganguly news) అక్రమ పద్ధతుల్లో ప్లాట్ కేటాయించారని.. కోల్‌కతా హైకోర్టు ద్విసభ్య ధర్మాసనం తేల్చింది. బంగాల్ ప్రభుత్వానికి రూ.50వేలు, బంగాల్ హౌసింగ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్‌కు రూ.50వేల చొప్పున జరిమానా విధించింది.
గంగూలీకి 2009లోనే సాల్ట్‌లేక్‌లో.. బంగాల్ సర్కార్ (Bengal Government) ప్లాట్‌ను కేటాయించగా... 2011లో సుప్రీంకోర్టు రద్దుచేసింది. ప్లాట్ కేటాయింపులో నిబంధనలు పాటించలేదని సుప్రీంకోర్టు తేల్చిచెప్పింది. 2013లో మళ్లీ బంగాల్ ప్రభుత్వం గంగూలీకి కోల్‌కతా సమీపంలో...రెండెకరాల భూమిని కేటాయించింది. దానిపై హైకోర‌్టులో పిటిషన్ దాఖలైంది. సుప్రీంకోర్టు కొట్టివేసిన నిబంధనల కింద.. మళ్లీ ప్లాట్ కేటాయించినందుకు బంగాల్ ప్రభుత్వం, హౌసింగ్ కార్పొరేషన్‌లకు.. రూ.50వేల చొప్పున జరిమానా విధించింది. సుప్రీంకోర్టు చెప్పిన నిబంధనలు పాటించనందుకు.. గంగూలీకి (Sourav Ganguly Land) కూడా జరిమానా విధించింది.
ఇదీ చూడండి: Ganguly Biopic: వెండితెరపై క్రికెట్ హీరో జీవితం