ETV Bharat / bharat

పేదలకు మరో 5 నెలలు ఉచిత రేషన్​ - pm modi

దీపావళి వరకు ఉచిత రేషన్​ పంపిణీ ప్రతిపాదనకు కేంద్ర కేబినెట్ బుధవారం ఆమోదం తెలిపింది. దీంతో దాదాపు 80 కోట్ల మందికి మరో ఐదు నెలల పాటు ఉచితంగా రేషన్​ అందనుంది.

PMGKAY
పీఎమ్​జీకేఏవై
author img

By

Published : Jun 23, 2021, 4:52 PM IST

గరీభ్​ కల్యాణ్​​ యోజన కింద నవంబర్ వరకు ఉచిత రేషన్​ పంపిణీ ప్రతిపాదనకు కేంద్ర కేబినెట్ బుధవారం ఆమోదం తెలిపింది. దీనితో దాదాపు 80 కోట్ల మందికి మరో ఐదు నెలల పాటు ఉచితంగా రేషన్​ అందనుంది. వచ్చే దివాళీ వరకు పేదలకు ఉచిత రేషన్​ అందించనున్నట్లు ప్రధాని నరేంద్ర మోదీ గత నెలలోనే ప్రకటించారు.

కరోనా మహమ్మారి పరిస్థితుల్లో పేదలు ఇబ్బంది పడకుండా ఉచిత రేషన్​ సౌలభ్యాన్ని పొడిగించటం వరుసగా ఇది నాలుగోసారి. ప్రతి వ్యక్తికి 5 కేజీల ఆహార ధాన్యాన్ని ఇవ్వనున్నారు. ఐదు నెలలకుగాను సుమారు 204 లక్షల టన్నుల ఆహార ధాన్యాలను పంపిణీ చేయనున్నారు.

గతేడాది లాక్​డౌన్ దృష్ట్యా గరీభ్ కల్యాణ్​ అన్న యోజన ద్వారా పేదలకు 8 నెలలు ఉచిత రేషన్​ అందించారు. కరోనా సెకండ్ వేవ్​లో ఈ ఏడాది మే, జూన్​ వరకు అమలు చేశారు. కరోనా పరిస్థితుల్లో పేదలు ఇబ్బంది పడకుండా ప్రస్తుతం మరో ఐదు నెలలు పొడిగించారు.

ఇదీ చదవండి:'దీపావళి వరకు వారికి ఉచిత రేషన్'

Delta Plus: 40కి పైగా 'కొత్తరకం' కేసులు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.