ETV Bharat / bharat

Cab Driver Get 9000 Crore : క్యాబ్​ డ్రైవర్​ ఖాతాలో రూ.9 వేల కోట్లు జమ.. 'లక్కీ' అనుకునే లోపే..

Cab Driver Get 9000 Crore : ఓ కారు డ్రైవర్​ బ్యాంకు ఖాతాలోకి ఉన్నట్టుండి అక్షరాల రూ.9వేల కోట్లు జమ అయ్యాయి. ఒకేసారి ఇంత డబ్బు వచ్చిందని తెలుసుకున్న అతడి ఆనందం ఎంతోసేపు నిలవలేదు. ఇంతకీ ఏం జరిగిందంటే?

Rental car driver received Rs. 9 thousand crores from bank in tamilnadu
Tamilnadu Car Driver Received 9 Thousand Crore
author img

By ETV Bharat Telugu Team

Published : Sep 21, 2023, 4:41 PM IST

Cab Driver Get 9000 Crore : ఓ క్యాబ్​ డ్రైవర్​ ఖాతాలో ఉన్నట్టుండి అక్షరాల రూ.9 వేల కోట్లు జమ అయ్యాయి. దీంతో ఎంతో సంతోషించిన అతడి ఆనందం ఎంతోసేపు నిలవలేదు. కలకలం రేపిన ఈ సంఘటన తమిళనాడులోని కొడంబక్కం ప్రాంతంలో వెలుగు చూసింది.

రూ.15లు ఉన్న ఖాతాలోకి రూ.9 వేల కోట్ల..
పళని నెయ్​కారాపట్టికి చెందిన రాజ్​కుమార్​ కొడంబక్కం ప్రాంతంలో తన స్నేహితులతో కలిసి నివసిస్తున్నాడు. అక్కడే ఉంటూ స్థానికంగా కారును రెంట్​కు తీసుకొని నడిపిస్తున్నాడు. ఈ క్రమంలో సెప్టెంబర్​ 9న మధ్యాహ్నం 3 గంటల సమయంలో రాజ్​కుమార్​ కారులో నిద్రిస్తున్నాడు. ఈ సమయంలో అతడి ఫోన్​కు తూత్తుకూడి జిల్లాలోని తమిళనాడు మెర్కంటైల్​ బ్యాంక్​ ప్రధాన కార్యాలయం నుంచి ఓ సందేశం వచ్చింది. అందులో రాజ్​కుమార్​ ఖాతాలోకి ఏకంగా రూ.9 వేల కోట్లు డిపాజిట్​ అయినట్లుగా మెసేజ్​ ఉంది. ఇది చూసిన రాజ్​కుమార్​కు ముందుగా ఏమీ అర్థం కాలేదు. కేవలం రూ.15లు ఉన్న తన బ్యాంకు ఖాతాలోకి ఒక్కసారిగా ఇంత పెద్ద మొత్తం ఎవరు జమ చేసి ఉంటారని అనుకున్నాడు. అనంతరం అది ఫేక్​ లేదా సైబర్​ నేరగాళ్లు పంపించిన సందేశం అని భావించాడు.

వాడుకున్న రూ.21 వేలను దాని కింద జమ!
అయితే ఆ మెసేజ్​ నిజమో కాదో అని తెలుసుకునేందుకు.. తన స్నేహితుడికి అప్పుగా ఇవ్వాల్సిన రూ.21 వేలను అతడికి పంపించి చూశాడు. దీంతో ఆ లావాదేవీ సక్సెస్​ఫుల్​ కావడం వల్ల.. తన అకౌంట్​లోకి వచ్చిన రూ.9వేల కోట్ల సందేశం నిజమే అని సంతోషించాడు. అయితే అతడి సంతోషం ఎంతోసేపు నిలవలేదు. ఎందుకంటే స్నేహితుడికి డబ్బులు పంపిన కొద్దిసేపటికే రాజ్​కుమార్​కు సంబంధిత బ్యాంకు నుంచి ఫోన్​ కాల్​ వచ్చింది. అందులో 'దయచేసి మీ బ్యాంక్​ అకౌంట్​లో డిపాజిట్​ అయిన రూ.9 వేల కోట్ల సొమ్మును వాడకండి. అవి పొరపాటుని మీకు బదిలీ అయ్యాయి' అని బ్యాంక్​ అధికారులు చెప్పారు. ఇది విన్న రాజ్​కుమార్​ ఒక్కసారిగా నిరాశ చెందాడు.

అనంతరం తనకు వచ్చిన డబ్బులో నుంచి రూ.21వేలను వాడుకున్నానని బ్యాంకు సిబ్బందికి తెలిపాడు. ఇది తెలుసుకున్న బ్యాంకు మేనేజ్​మెంట్​.. వినియోగించిన డబ్బును తిరిగి చెల్లించాల్సిందిగా రాజ్​కుమార్​ను కోరారు. లేదంటే చర్యలు తీసుకుంటామని అతడిని బెదిరించే ప్రయత్నం చేశారు. దీంతో వెంటనే రాజ్​కుమార్​ దగ్గర్లోని పోలీస్​ స్టేషన్​కు వెళ్లి సదరు బ్యాంకు నుంచి తనకు ప్రాణహాని ఉందంటూ ఫిర్యాదు చేశాడు. రాజ్​కుమార్​ కంప్లైంట్​ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. ఇరు వర్గాల న్యాయవాదులను పిలిపించి రాజీ కుదిరించారు. దీని ప్రకారం రాజ్​కుమార్​ వాడుకున్న రూ.21 వేలను వాహన​ లోన్​ కింద బ్యాంకు జమ కడుతుందని బ్యాంకు తరఫు న్యాయవాదులు చెప్పడం వల్ల కథ సుఖాంతం అయింది. కాగా, ఈ సంఘటన స్థానికంగా కలకలం రేపింది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.