ETV Bharat / bharat

Bypolls in India 2021: దేశవ్యాప్తంగా ఉపఎన్నికల పోలింగ్ ప్రారంభం

దేశవ్యాప్తంగా (Bypolls in india latest) ఉపఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. 13 రాష్ట్రాలు, ఓ కేంద్రపాలిత ప్రాంతం పరిధిలోని 3 లోక్​సభ, 29 అసెంబ్లీ స్థానాలకు పోలింగ్​ జరుగుతోంది.

Bypolls in india 2021
ఉపఎన్నికలు తాజా వార్తలు
author img

By

Published : Oct 30, 2021, 7:14 AM IST

Updated : Oct 30, 2021, 3:37 PM IST

దేశవ్యాప్తంగా 13 రాష్ట్రాలు, ఒక కేంద్రపాలిత ప్రాంతం పరిధిలోని మూడు లోక్‌సభ, 29 అసెంబ్లీ స్థానాలకు ఉపఎన్నికల పోలింగ్‌ ప్రారంభమైంది. కొవిడ్ నేపథ్యంలో పోలింగ్ కోసం తగిన జాగ్రత్తలు సహా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాటు చేసినట్లు ఎన్నికల సంఘం అధికారులు తెలిపారు. కేంద్ర పాలిత ప్రాంతం దాద్రానగర్ హవేలీ, హిమాచల్‌ ప్రదేశ్‌లోని మండి, మధ్యప్రదేశ్‌లోని ఖాంద్వా లోక్‌ సభ స్థానాలకు ఉప ఎన్నికలు జరుగుతున్నాయి. అసోంలోని 5, బంగాల్‌లో 4, మధ్యప్రదేశ్‌, హిమాచల్‌ ప్రదేశ్‌, మేఘాలయ రాష్ట్రాల్లో 3 చొప్పున అసెంబ్లీ స్థానాలకు పోలింగ్ ప్రారంభమైంది. బిహార్, కర్ణాటక, రాజస్థాన్‌ రాష్ట్రాలలో రెండు.. తెలంగాణ, ఏపీ, హరియాణా, మహారాష్ట్ర, మిజోరంలలో ఒక్కో అసెంబ్లీ స్థానానికి ఎన్నికలు జరుగుతున్నాయి.

ఈ ఎన్నికలను రాజకీయ పార్టీలు ప్రతిష్ఠాత్మకంగా తీసుకుని బరిలోకి దిగాయి. చాలా సీట్లలో పోటీ ప్రధానంగా భాజపా, కాంగ్రెస్ మధ్య ఉన్నట్లు కనిపిస్తోంది.

బంగాల్​లో పోరు..

దేశవ్యాప్తంగా ఉపఎన్నికలు జరుగుతున్నా.. అందరి చూపు బంగాల్​పైనే ఉంది. భాజపా, టీఎంసీలు ఈ ఉపఎన్నికలను ప్రతిష్ఠాత్మకంగా భావిస్తున్నాయి. అక్కడ జరుగుతున్న నాలుగు స్థానాల్లోనూ ప్రధానంగా దిన్హంతపైనే చర్చ జరుగుతోంది. టీఎంసీ సీనియర్ నాయకుడు ఉదయన్ గుహా ఏప్రిల్​లో జరిగిన ఎన్నికల్లో కోల్పోయిన తన స్థానాన్ని ఈ సారి ఎలాగైనా దక్కించుకోవాలని చూస్తున్నాడు. ప్రస్తుతం కేంద్ర హోం శాఖ సహయ మంత్రిగా పనిచేస్తున్న నిశిత్ ప్రమాణిక్ తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన నేపథ్యంలో ఈ సీటులో ఉపఎన్నిక అనివార్యమైంది. దిన్హంత, శాంతిపూర్​ స్థానాలను పోటీ భాజపా ప్రతిష్ఠాత్మకంగా భావిస్తోంది.

ఇదీ చదవండి: యూపీఎస్​సీ ప్రిలిమ్స్​-2021 ఫలితాలు విడుదల

Last Updated : Oct 30, 2021, 3:37 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.