బంగాల్లోని ఏడు నియోజకవర్గాలకు వచ్చే నెలలో ఉపఎన్నికలు జరిగే అవకాశమున్నట్లు తెలుస్తోంది. ఈ విషయమై భారత ఎన్నికల సంఘం త్వరలో తుది నిర్ణయం తీసుకోనున్నట్లు సమచారం. భవానిపుర్, ఖ్రాడా, శాంతిపుర్, దిన్హాటా, గోసబా, సంసెర్గుంజ్, జాంగిపుర్ అసెంబ్లీ నియోజకవర్గాలలో ఉపఎన్నికలు జరగాల్సి ఉంది. రాష్ట్రంలో విశ్వకర్మ పూజ ముగిసిన వెంటనే ఎన్నికలు జరుగుతాయని సంబంధిత వర్గాలు తెలిపాయి.
ఈ ఏడు నియోజకవర్గాల్లో ఎన్నికలకు సన్నాహాలు ఇప్పటికే ప్రారంభమయ్యాయని ఎన్నికల సంఘం తెలిపింది. అంతకుముందు రాష్ట్రంలో కరోనా పరిస్థితి గురించి సమాచారం కోరుతూ.. ఓ లేఖ రాసింది ఈసీ. దీనిపై స్పందించిన రాష్ట్ర ప్రభుత్వం.. కరోనా నియంత్రణలో ఉందని, అందువల్ల ఉప ఎన్నికలను నిర్వహించడంలో ఎలాంటి సమస్య ఉండదని పేర్కొంది. ఫలితంగా వచ్చే నెలలో ఉపఎన్నికలు జరగుతాయిని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
ఇదీ చూడండి: 'అభిషేక్ బెనర్జీపై దాడిలో అమిత్ షా హస్తం'