ETV Bharat / bharat

బస్సు సర్వీసులు 'ఛలో' డిజిటల్.. త్వరలో వాటర్​ మెట్రో!

author img

By

Published : Mar 6, 2022, 2:20 PM IST

Updated : Mar 6, 2022, 5:20 PM IST

Chalo Card: బస్సు టికెట్​ కొనుగోలు సమయంలో సరిపడా క్యాష్ లేకపోవడం మొదలైన సమస్యలతో ​ఇబ్బంది పడుతుంటారు ప్రయాణికులు. ఇందుకు పరిష్కారంగా కేరళలోని కాసరగోడ్​లో డిజిటలీకరణ చేపట్టారు. మరోవైపు కొచ్చిలో త్వరలో వాటర్​ మెట్రో సేవలు అందుబాటులోకి రానున్నాయి.

Chalo Card
ఆ ప్రాంతంలో బస్సు సర్వీసులు 'ఛలో' డిజిటల్
బస్సు సర్వీసులు 'ఛలో' డిజిటల్

Chalo Card: టికెట్టుకు సరిపడా నగదు ఉండకపోవటం.. ఇచ్చిన డబ్బుకు కండక్టర్​ వద్ద చిల్లర లేకపోవడం వంటి సమస్యలను బస్సు ప్రయాణికులు తరచూ ఎదుర్కొంటారు. ఈ ఇబ్బందులకు చెక్​ పెడుతూ కేరళలోని కాసర​గోడ్​లో 'ఛలో ట్రావెల్​ కార్డ్'​ అందుబాటులోకి తీసుకొచ్చారు. జిల్లాలోని బస్సు సర్వీసుల డిజిటలీకరణలో భాగంగా ఈ కొత్త పద్ధతి.. విడతల వారీగా అమలు కానుంది.

Chalo Card
ఛలో ట్రావెల్​ కార్డ్

ప్రస్తుతం మెట్రో రైల్వేస్టేషన్లలో అందుబాటులో ఉన్న మెట్రో కార్డు వంటిదే ఈ ఛలో ట్రావెల్​ కార్డు. ఇందులో రూ.30 నుంచి రూ. 3వేల వరకు రీఛార్జ్​ చేసుకోవచ్చు. ఈ కార్డుతో టికెట్​ ధరపై 10 శాతం డిస్కౌంట్​ కూడా అందిస్తున్నారు.

మరోవైపు.. కేరళ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపడుతున్న వాటర్​ మెట్రో ప్రాజెక్ట్​ కూడా త్వరలోనే కొచ్చి ప్రజలకు అందుబాటులోకి రానుంది. మరో నాలుగు బోట్లు సిద్ధమయ్యాక.. మొదటి విడతలో భాగంగా వైట్టిలా నుంచి కక్కానాడ్​ మధ్య సేవలు ప్రారంభం కానున్నాయి. 50 మంది ప్రయాణించేందుకు వీలుగా కొన్ని.. 100 మంది ప్రయాణించేలా మరికొన్ని బోట్లను కొచ్చిన్​ షిప్​యార్డు తయారుచేస్తోంది.

Chalo Card
కొచ్చి వాటర్​ మెట్రో ప్రాజెక్టు

76 కిలోమీటర్ల జల మార్గంలో 38 టెర్మినల్స్​ ఏర్పాటు చేసిన కొచ్చి వాటర్​ మెట్రో.. మొత్తం 78 బోట్లను అందుబాటులోకి తేనుంది.

ఇదీ చూడండి : పైలట్ చాకచక్యం.. సీఎం మమత సేఫ్

Last Updated : Mar 6, 2022, 5:20 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.