Bus Fell InTo River In Jharkhand Today : ఝార్ఖండ్‌లోని గిరిడీహ్ జిల్లా.. బరాకర్ నదిలో ఓ బస్సు అదుపుతప్పి పడిపోయింది. ఈ ఘటనలో 25 మంది ప్రయాణికులు గాయపడగా.. ఇద్దరు మృతి చెందినట్లు తెలుస్తోంది. ఘటనాసమయంలో బస్సులో 30 మంది ప్రయాణికులు ఉన్న సమాచారం. ప్రమాదంపై సమాచారం అందుకున్న పోలీసులు, స్థానికులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. సహాయక చర్యలు ప్రారంభించారు. ఈ ఘటన శనివారం సాయంత్రం జరిగింది
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. రాంచీ నుంచి గిరిడీహ్ వెళ్తున్న ఓ బస్సు బరాకర్ నదిలో పడిపోయింది. రాంచీలో బయలుదేరిన బస్సు.. బరాకర్ నది వద్దకు చేరుకోగానే అదుపు తప్పి బస్సు నదిలో పడిపోయినట్లు సమాచారం. ఘటన అనంతరం ఆ ప్రాంతంలో ఒక్కసారిగా భయానక వాతావరణం నెలకొంది. ప్రయాణికుల కేకలు విన్న స్థానికులు.. ఘటనాస్థలికి చేరుకున్నారు. వెంటనే సహాయక చర్యలు ప్రారంభించి.. పోలీసులకు సమాచారం అందించారు. ఆ తర్వాత డీసీ నమన్ ప్రియేష్ లక్డా, ఎస్పీ దీపక్ శర్మ కూడా ఘటనా స్థలానికి చేరుకున్నారు. ముమ్మరంగా సహాయక చర్యలను చేపట్టాలని ఆదేశించారు. అంబులెన్స్‌లో గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించారు.
UP Tractor Accident : ఎదురెదురుగా వస్తున్న ట్రాక్టర్, ట్రక్కు ఢీకొని ఆరుగురు భక్తులు ప్రాణాలు కోల్పోయారు. మరో ఎనిమిది మంది తీవ్రంగా గాయపడ్డారు. ఉత్తర్‌ప్రదేశ్.. హాథ్రస్ జిల్లాలోని సదాబాద్ రోడ్లో.. శుక్రవారం రాత్రి ఈ ఘటన జరిగింది.
ట్రాక్టర్, ట్రాలీలో మొత్తం 45 మంది భక్తులు ఉన్నారని పోలీసులు తెలిపారు. వీరిలో మహిళలు, చిన్న పిల్లలు కూడా ఉన్నారనివె ల్లడించారు. వీరంతా ఎటా జిల్లాలోని జలేసర్ నుంచి మథురలోని గోవర్ధన్‌కు వెళుతున్నారని వివరించారు. ఈ ఘటనలో మృతులను విక్రమ్ (45), మాధురి (22), హేమలత (12), లక్ష్మీ (18), అభిషేక్ (20), విష్ణు (20)గా పోలీసులు గుర్తించారు. క్షతగాత్రులను స్థానిక ఆసుపత్రిలో చికిత్స నిమిత్తం చేర్పించినట్లు వెల్లడించారు. ప్రమాదానికి ట్రక్కు డ్రైవర్ నిర్లక్ష్యమే కారణమని పోలీసులు తెలిపారు. ముగ్గురిని అదుపులోకి తీసుకున్నట్లు చెప్పారు.